రోడ్డు రాజకీయం.. వైసీపీకీ వ్యతిరేకంగా టీడీపీ, జనసేన గళం.

ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, అడుగుకో గుంత, గజానికో గొయ్యి తయారైందని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రోడ్లపై ప్రభుత్వం నయాపైసా ఖర్చు చేయలేదని, ప్రజల ఇబ్బందులు ప్రభుత్వానికి పట్టవా అంటూ జనసేన నేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రోడ్ల గురించి టీడీపీ కూడా ఇదే వాదన వినిపిస్తుంది. ప్రభుత్వానికి చిత్తశుధి లేకపోవడం వల్లే రోడ్ల పరిస్థితి ఇలా తయారైందంతూ విమర్శలు చేస్తున్నారు.

అధిక సెస్ వసూలు చేస్తున్నప్పటికీ రోడ్లు బాగు చేయరా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరింది. ఈ మేరకు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ చెంగల్ రాయుడు మాట్లాడారు. ఈ నేపథ్యంలో వైసీపీ వాదన వేరేలా ఉంది. రొడ్ల విషయంలో ప్రతిపక్షాలది వితండవాదమని, అమరావతిని రాజధానిగా చేద్దామనుకున్న చంద్రబాబు, అక్కడ ఒక్క డబల్ రొడ్ అయినా వేయించారా అని ప్రస్తుత ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కౌంటర్ వేసారు. ఏదెలా ఉన్నా రోడ్ల రాజకీయంపై కౌంటర్లు, ఎన్ కౌంటర్లు మరికొన్ని రోజులు జరిగేలా కనిపిస్తున్నాయి.