OMG పత్తి మొక్కలో ఇన్ని ఔషధగుణాలా..? పిచ్చి చేష్టలకు బెస్ట్‌ మెడిసిన్‌

-

వర్షాలు పడుతున్నాయి.. రైతులు పత్తి విత్తనాలు కూడా వేయడం ప్రారంభించారు. పత్తి పంట సాగులో కేవలం మొక్క నుంచి వచ్చే పత్తి మాత్రమే ఉపయోగపడుతుందని మనకు తెలుసు. కానీ పత్తి ఆకుల వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. ఔషధ గుణాలు పత్తి మొక్కలో ఉన్నాయి. నమ్మశక్యంగా లేదు కదా..! పత్తి మొక్కతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చూద్దామా..!

ప‌త్తి వేరును పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. దీనిని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో క‌లిపి స‌గం గ్లాస్ అయ్యే వ‌ర‌కు మ‌రిగించి దానికి త‌గినంత కండ‌చ‌క్కెర‌ను క‌లిపి కొద్ది కొద్దిగా తాగుతూ ఉంటే.. మూత్రంలో మంట త‌గ్గుతుందట.

ప‌త్తి ఆకును మెత్త‌గా నూరి లేదా ప‌త్తిని కాల్చి ఆ బూడిద‌ను పైన లేప‌నంగా రాస్తూ ఉండ‌డం వ‌ల్ల గాయాలు త‌గ్గుతాయట.

10 గ్రాముల ప‌త్తి పువ్వుల‌ను ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా న‌లిపి వ‌డ‌క‌ట్టి త‌గినంత కండ చ‌క్కెర‌ను క‌లిపి ఆ నీటిని రెండు భాగాలుగా చేసి రెండు పూట‌లా తాగిస్తే.. పిచ్చి చేష్ట‌లు త‌గ్గి మామూలు స్థితికి వ‌స్తారట. ఇంట్రస్టింగ్‌ కదా..!

ప‌త్తి ఆకులను నూరి ర‌సాన్ని తీసి… ఈ ర‌సాన్ని గ‌వద బిళ్ల‌ల‌పై లేప‌నంగా రాస్తూ ఉండ‌డం వ‌ల్ల క్ర‌మంగా గ‌వ‌ద బిళ్ల‌లు తగ్గుతాయి.

ప‌త్తిచెట్టు బెర‌డును, శొంఠి పొడితో క‌లిపి మెత్త‌గా నూరి ఆ మిశ్ర‌మాన్ని లేప‌నంగా రాయ‌డం వ‌ల్ల వృష‌ణాల వాపు త‌గ్గుతుంది.

పెస‌ర‌ప‌ప్పు, పాలు, చ‌క్కెర‌ల‌ను క‌లిపి పాయ‌సాన్ని చేసి… ఈ పాయ‌సం ఉడికేట‌ప్పుడు అందులో 3 గ్రాముల ప‌త్తి పువ్వుల పొడిని వేసి ఉడికించి ఆ పాయ‌సాన్ని తిన‌డం వ‌ల్ల పురుషుల‌లో వీర్య బ‌ల‌హీన‌త త‌గ్గుతుంది.

పిరియడ్స్‌ ఆగిన స్త్రీలు 20 గ్రాముల ప‌మిడి ప‌త్తికాయ‌ల‌ను తీసుకుని దంచి అర లీట‌ర్ నీటిలో వేసి స‌గం అయ్యే వ‌ర‌కు మ‌రిగించి దానికి 20 గ్రాముల పాత బెల్లాన్ని క‌లిపి రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగాలి. ఇలా తాగిన గంట వ‌ర‌కు ఏమీ తిన‌కూడదు.. ఇలా చేయ‌డం వ‌ల్ల స్త్రీల‌ల్లో ఆగిన పిరియడ్స్‌ ఆగిన మ‌ర‌లా వ‌స్తుంది. అయితే పిరియడ్స్‌ ప్రారంభం కాగనే.. ఆ కషాయాన్ని తాగడం ఆపేయాలని గుర్తుంచుకోండి.

పామిడి ప‌త్తి గింజ‌ల‌ను చిన్న మంట‌పై వేయించి దంచి జ‌ల్లించి ఆ పొడిని నిల్వ చేసుకోవాలి. ఈ పొడితో దంతాల‌ను శుభ్రం చేసుకోవ‌డం వ‌ల్ల దంతాల నొప్పులు త‌గ్గుతాయట.

అసలు పత్తి మొక్కలో ఇన్ని రోగాలను నయం చేయగల శక్తి ఉందని చాలామందికి ఇప్పటి వరకూ తెలిసి ఉండకపోవచ్చు. ఓపిక ఉంటే మీరు ట్రే చేయండి. అయితే.. ఈ సమాచారం అంతా నిపుణులు ఇచ్చిందే కానీ.. మనలోకం సొంతంగా రాసింది కాదని గమనించగలరు.

Read more RELATED
Recommended to you

Latest news