రుతుస్రావ స్వఛ్ఛత దినోత్సవం: రుతుస్రావ స్వఛ్ఛత విషయంలో చేయాల్సిన పనులేంటో తెలుసుకోండి.

రుతుస్రావం మహిళల జీవితంలో ఒక భాగం. ఐతే చాలామందికి రుతుస్రావ స్వఛ్ఛత విషయంలో పెద్దగా అవగాహన లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ విషయం మీద చాలా అపనమ్మకాలతో ఉన్నారు. యునెస్కో లెక్కల ప్రకారం భారతదేశంలో 23శాతం మంది మహిళలు రుతుస్రావ స్వఛ్ఛత విషయంలో అవగాహన లేమితో ఉన్నారు. అందువల్ల ప్రతీ ఏడాఇ రుతుస్రావం స్వఛ్ఛత విషయంలో అవగాహన పెంచేందుకు ఈ ప్రత్యేకమైన రోజుని ఎన్నుకున్నారు. మే 28వ తేదీనీ రుతుస్రావ స్వఛ్ఛత దినోత్సవంగా జరుపుతారు.

రుతుస్రావం స్వఛ్ఛత విషయంలో చేయాల్సిన పనులు

శానిటేషన్ పద్దతి

రుతుస్రావ సమయంలో మహిళలకి సౌకర్యాన్ని ఇచ్చే సానిటరీ పాడ్స్, ఇంకా మార్కెట్లో లభించే ఇతర వస్తువుల విషయంలో స్వఛ్ఛత పాటించాలి. ఒకే పద్దతిలో శానిటైజ్ చేయడం మంచిది. వేరు వేరు పద్దతులు వాడితే ఇబ్బంది కలగవచ్చు. రాషెస్ మొదలగునవి ఏర్పడే ప్రమాదం ఉంది. ఒక్కోసారి అవి విషపూరితంగా మారతాయి.

సరైన వ్యక్తిని ప్రశ్నలు అడగండి

మొదటిసారి రుతుస్రావం జరిగినపుడు మైండ్ లో ఎన్నో అనుమానాలు ఉంటాయి. ఆ అనుమానాలన్నింటికీ సమాధానాలు ఇచ్చే వ్యక్తులను ప్రశ్నలు అడగాలి. శరీరంలో జరిగే మార్పుల విషయంలో ఒక ఖచ్చితమైన అవగాహన రావాలి. అప్పుడే స్వఛ్ఛత గురించి సులభంగా అర్థం అవుతుంది.

అనవసరమైన నమ్మకాలు, అడ్డంకులను తొలగించుకోండి

రుతుస్రావం సమయంలో సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే అది మూడ్ స్వింగ్స్ కి దారి తీసి విపరీతమైన ఒత్తిడి తీసుకువస్తుంది. ఆక్టివ్ గా ఉండడం బెటర్. ఆ సమయంలో ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు అనడం వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

క్రమం తప్పకుండా స్నానం చేయాలి.

రుతుస్రావ తేదీలలో ఖచ్చితంగా స్నానం చేయాలి. దానివల్ల శరీరం విశ్రాంతి పొందుతుంది. అదీగాక స్వఛ్ఛత కూడా. అందుకే క్రమం తప్పకుండా స్నానం చేయాలి. లేదంటే ఇన్ఫెక్షన్లు ఏర్పడే అవకాశం ఎక్కువ.

కిట్ ఉంచుకోండి

రుతుస్రావ చక్రం మీకు తెలుసు కాబట్టి, ఆ తేదీలలో ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే గనక మీతో పాటు ఒక కిట్ ఉంచుకోండి. దాన్లో స్వఛ్ఛతకి సంబంధించిన శానిటరి పాడ్ నుండి అన్నీ ఉండాలి. ఇది మీకెలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది.