మానసిక ఆరోగ్యం: ఈ ఫోబియాస్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..?

-

మనుషుల్లో చాలా రకాల ఎమోషన్స్ ఉంటాయి. భయం కూడా మనుషుల్లో ఉండే ఒక ఎమోషన్. ప్రతి ఒక్కరు కూడా దేనికో దానికి భయపడుతుంటారు. కానీ పురుషులు గడ్డం చూసి కూడా భయపడతారని మానసిక నిపుణులు అంటున్నారు. అయితే ఈ రోజు ఎవరికీ తెలియని ఫోబియాస్ గురించి తెలుసుకుందాం.

ఫోబియా లో చాలా రకాలు ఉంటాయి. నీటిని చూసి భయపడటం, ఎత్తున చూసి భయపడ్డం ఇలా వివిధ రకాలు ఉంటాయి. కానీ ఇవి చాలా మందికి తెలుసు. అయితే తెలియని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఫోబియా లో రకాలు:

నిద్ర పోవడానికి భయం:

కొంత మంది మంచం మీద నిద్రపోవడానికి భయపడతారు. అదేవిధంగా మామూలుగా నిద్రపోవడానికి కూడా వాళ్ళలో భయం ఉంటుంది. తిరిగి మళ్ళీ లేవలేను ఏమో అని భయపడతారు. దీనిని somniphobia అని అంటారు.

మొబైల్ నెట్వర్క్ వల్ల కలిగే భయం:

మొబైల్ నెట్వర్క్ లేకపోవడం వల్ల సమస్యలు వస్తాయేమోనని భయపడుతూ ఉంటారు. దీనిని నోమోఫోబియా అంటారు.

13 అంకె చూసి భయపడటం:

13 అంకె చాలా చోట్ల మంచిగా భావించరు. అయితే కారణాలు ఒకేలా ఉండకపోవచ్చు కానీ దీనిని చూసి చాలా దురదృష్టంగా భావిస్తారు. దీన్ని చూసి భయపడితే దానిని Triskadekaphobia అంటారు.

పర్ఫెక్ట్ గా లేనేమో అనిభయం:

ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్ గా ఉండరు. అయితే వీళ్లు పర్ఫెక్ట్ గా ఉండలేదేమో అని భయపడుతూ ఉంటారు. దీనిని atelophobia అంటారు.

నడవడానికి భయం:

నడవడానికి, నిలబడడానికి కూడా కొందరిలో భయం ఉంటుంది. నించున్న లేదా నడిచిన వెంటనే పడిపోతారు ఏమో అన్న భయం వాళ్ళల్లో ఉంటుంది. దీనిని basophobia అంటారు.

గడ్డం భయం:

ముఖం మీద గడ్డం ఉంటే వీళ్లల్లో చాలా భయం ఉంటుంది దీనినే pogonophobia అంటారు.

Read more RELATED
Recommended to you

Latest news