శీతాకాలంలో పచ్చిమిర్చి తింటున్నారా? మంచి పని చేశారు

-

పచ్చిమిర్చి తింటే కడుపులో మంట అని అనుకుంటాం. ఆ విషయం పక్కనపెడితే శీతాకాలంలో పచ్చిమిర్చిని తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటితో చాలా మేలు జరుగుతుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.

– పచ్చిమిర్చిని తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అంతేకాకుండా ఒబిసిటీతో ఇబ్బంది పడేవారు, మధుమేహం బారిన పడకుండా ఉండాలంటే పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకోవాలి.
– రోజూ తినే ఆహారంలో కారానికి బదులుగా మిర్చివాడకం అలవాటుగా మార్చుకోండి. దీనివల్ల శరీరంలోని ఇన్సులిన్‌ ఉత్పత్తి సక్రమంగా ఉండి మధుమేహం దరిచేరదు.
– ఇలా ఇన్సులిన్‌ ఉత్పత్తి అయి రక్తంలో షుగర్‌ లెవల్స్‌ అరవైశాతం వరకు నియంత్రించబడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

– పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో మంట లేకుండా ఉండడంతోపాటు శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది. ఇంకా గుండెపోటు రాకుండా నివారిస్తుంది ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
– మిరపకాయల్లో గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గించే ‘క్యాప్‌సేసియస్‌’ అనే పదార్థం ఉంటుందని దీనివల్ల గుండెకు రక్షణ కలుగుతున్నది ఇటలీ పరిశోధకులు గుర్తించారు. ఈ వివరాలను ‘అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీ’ జర్నల్‌లో ప్రచురించారు.
– భోజనంలో భాగంగా వారానికి నాలుగుసార్లు మిరపకాయలు తింటే గుండెపోటు ముప్పు 40 శాతం తగ్గుతుందని పరిశోధకులు వెల్లడించారు. దాదాపు 23వేల మందిపై జరిగిన పరిశోధనలో ఈ విషయం వెల్లడి అయింది. వారానికి నాలుగుసార్లు ఆహారంలో మిరపకాయలను తీసుకోవడంవల్ల గుండెపోటు వచ్చే అవకాశం 40 శాతం తక్కువగా ఉందని వారు గుర్తించారు.
– కేవలం పర్చిమర్చే తినాలనేం లేదు. పచ్చిమర్చికి సమానంగా పండుమిర్చి పనిచేస్తుంది. వీటిలో ఏదైనా పర్వాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news