చాలా మంది ఖాళీ కడుపుతో ఈ తప్పులు చేస్తూ ఉంటారు. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఈ తప్పులు కనుక చేస్తే ఇబ్బందులు తప్పవు. అయితే మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఖాళీ కడుపుతో చేయకూడని తప్పులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసమే పూర్తిగా చూసేయండి.
కెఫీన్:
ఖాళీ కడుపుతో చాలా మందికి కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఖాళీ కడుపు తో కాఫీ తాగడం మంచిది కాదు. ఇలా కాఫీ తాగడం వల్ల ఎసిడిటీ వస్తుంది. దీనితో హైడ్రోక్లోరిక్ యాసిడ్ సెక్రీట్ అవుతుంది కాబట్టి ఉదయాన్నే ఖాళీ కడుపున కాఫీ తాగకుండా ఉండడం మేలు.
ఆల్కహాల్:
ఖాళీ కడుపుతో కానీ తిన్న చాలా సేపు తర్వాత కానీ ఆల్కహాల్ తీసుకోవడం మంచిది కాదు. ఇలా చేయడం వలన పల్స్ రేటు కూడా టెంపరరీగా తగ్గిపోతుంది. అలానే కిడ్నీ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, లివర్ సమస్యలు, బ్రెయిన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
చూయింగ్ గమ్ తినడం:
ఖాళీ కడుపున చూయింగ్ గమ్ తినడం వల్ల డైజెస్టివ్ సిస్టం డైజెస్టివ్ యాసిడ్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. దీంతో కడుపు మీద ఉండే లైనింగ్ తొలగి పోతుంది తద్వారా అల్సర్లు మొదలైన సమస్యలు వస్తాయి. కనుక ఈ చిన్న చిన్న తప్పులు చెయ్యకుండా జాగ్రత్తగా వుండండి. లేదు అంటే ఇబ్బందులు మీకు తప్పవు.