పుట్టగొడుగులు అంటే ఇష్టపడని వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. వీటితో ఏం చేసినా నాన్‌వెజ్ తిన్నట్లే ఉంటుంది. అయితే చాలామందికి పుట్టగొడుగులు తీసుకునేప్పుడు అందులో నాణ్యతను గుర్తించడం తెలియదు. నాచురల్‌గా వచ్చాయి కాబట్టి.. పైన ఏమైనా మచ్చలు ఉన్నా ఏం కాదులే అనుకుంటారు. కానీ కొన్నిపుట్టగొడుగులు ఆరోగ్యాన్ని దెబ్బతిస్తాయి. కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా అవుతాయట. మరి వాటిని గుర్తించడం ఎలా..?
సాధారణంగా పుట్టగొడుగులను శాఖాహారుల ‘చికెన్’గా భావిస్తుంటారు. పుట్టగొడుగులతో రకారకాల వంటలు చేస్తుంటారు. దీన్ని కూరగాయగా, ఊరగాయకు సలాడ్‌గా కూడా ఉపయోగిస్తుంటారు. పుట్టగొడుగుల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో మన ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ బి, డి, పొటాషియం, కాపర్, ఐరన్, ఫైబర్ సెలీనియం వంటివి పోషకాలు ఎక్కవగా ఉంటాయి.
వాసన: పుట్టగొడుగులు కుళ్ళిన లేదా తడిగా ఉన్న, అటువంటి పుట్టగొడుగులు కూడా మంచివి కావు. ఇది కాకుండా, పుట్టగొడుగుల నుండి ఏదైన వాసన వచ్చినా సరే అవి వాడకూడదు..పుట్టగొడుగులు ఎంతటి ఆరోగ్యకరమైనవో మంచి వాటిని ఉపయోగించకపోతే అవి అంత హానికరం అవుతాయి.
మరకలు, ఫంగస్: సాధారణంగా తినడానికి ఉపయోగించే పుట్టగొడుగులు తెల్లగా ఉంటాయి. పుట్టగొడుగులను కొనుగోలు చేసేటప్పుడు, దాని పై భాగాన్ని (గొడుగు)ను చెక్ చేయాలి. పుట్టగొడుగులపై చిన్న మచ్చలు కనిపిస్తే, వాటిని తీసుకోకపోవడమే మంచిది. మరోవైపు, పుట్టగొడుగులపై నల్ల మచ్చలు లేదా ఫంగస్ వంటివి ఉంటే, అది కుళ్ళిపోయినవి అని సంకేతం.
పుట్టగొడుగులు అసాధారణంగా కనిపించిన లేదా కుంచించుకుపోయిన వాటిని తినడం మంచిది కాదు. గొడుగు దగ్గర ఉన్న కాండం రింగ్ లాంటి ఆకారాన్ని కలిగి ఉండి.. కొంత సమయం తరువాత, వాటి రంగు గోధుమ రంగులోకి మారుతుంది. ఇలాంటి వాటికి దూరంగా ఉండడం మంచిది.
ఊర్లలో చాలామంది.. వర్షాలకు వచ్చే పుట్టగొడుగులను తెచ్చుకుని వండుకుంటారు. వీటిని అడవి పుట్టగొడుగులు అంటారు. ఇవి ఎక్కువగా పర్వత ప్రాంతాలలో లేదా చల్లని ప్రదేశాలలో పెరుగుతాయి. అయితే.. ఈ పుట్టగొడుగులు విషపూరితమైనవి. వాటిని తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుందట.