కారులో వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసింది ఓ ఎమ్మెల్యే కూతురు. ఈ క్రమంలో ఆమెను అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించింది. పోలీసులతో వాగ్వాదానికి దిగింది. నోటికి వచ్చినట్టుగా బండ బూతులు తిడుతూ.. అనుచితంగా ప్రవర్తించింది. ఈ తతంగాన్ని రికార్డు చేసిన ఓ రిపోర్టర్‌తో దురుసుగా మాట్లాడింది. దీంతో పోలీసులు ఆమెకు రూ.1000 జరిమానా విధించారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ నింబావలి కూతురు రేణుకా నింబావళికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గురువారం తెల్లవారుజామున బీఎండబ్ల్యూ కారులో తన స్నేహితులతో కలిసి బయటికి వెళ్లింది. అక్కడ ట్రాఫిక్ సిగ్నల్‌ను బ్రేక్ చేసింది. దీంతో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో కోపంలో చిర్రెత్తిపోయింది. ఈ వీడియోను ఎక్స్ ప్రెస్ బెంగళూరు తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
"For your information, this is an MLA vehicle": BJP MLA Aravind Limbavali’s daughter ‘misbehaves’ with traffic cops for imposing fine
Read here: https://t.co/znGgj9ApfQ#Karnataka #Bengaluru pic.twitter.com/jMk5EMDmKN
— Express Bengaluru (@IEBengaluru) June 10, 2022