హైబీపీ ఉన్నవాళ్ళు ముట్టుకోకూడని ఆహారాలు..

-

హైబీపీ వల్ల చాలా మంది బాధపడుతున్నారు. దీనివల్ల రక్తప్రసరణ వేగం పెరిగి గుండెకు వేగంగా రక్తం చేరుతుంది. దానివల్ల రక్తనాళాల్లో రక్త ప్రసరణ మోస్తారు కంటే ఎక్కువ వేగంగా ప్రవహిస్తుంది. ఇది గుండెకు చేటు చేస్తుంది. రక్తం గుండెకు చేరే వేగం పెరిగితే గుండె కొట్టుకోవడంలో మార్పులు సంభవిస్తాయి. దానివల్ల అనేక గుండె సంబంధిత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఐతే ఈ పరిస్థితిని అదుపులో ఉంచడానికి కొన్ని ఆహారాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఉప్పు

ఉప్పు ఎక్కువ తింటే బీపీ పెరుగుతుందని అందరికీ తెలిసిన విషయమే. ఇందులోని సోడియం వల్ల మానవ శరీరం దాని సమతుల్యతని కోల్పోతుంది. దీనివల్ల కిడ్నీలు రక్తాన్ని సరిగ్గా శుద్ధి చేయవు. దానివల్ల మూత్రం ఉత్పత్తి కాదు. అప్పుడు రక్తపీడనం పెరుగుతుంది. హైబీపీతో బాధపడేవారు తమ రోజు వారి ఆహారంలో 1500మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తినరాదు.

తయారుగా ఉన్న సూప్

ఆల్రెడీ ప్రిపేర్ చేసిన సూప్ లని తాగడం వల్ల బీపీ పెరుగుతుంది. సూపుల్లో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సూపులు ఆరోగ్యకరమని చెబుతున్నప్పటికీ తయారుగా ఉంచిన వాటిని తాగకపోవడమే ఉత్తమం.

ప్రాసెస్ చేసిన మాంసం

ప్రాసెస్ చేసిన మాంసం ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేస్తారు. అందువల్ల దానిలో సోడియం శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాసెస్ చేసిన మాంసంతో పాటు మరోటి కలుపుకుని తింటే అప్పుడు సోడియం శాతం మరింత పెరుగుతుంది.

ఫాస్ట్ ఫుడ్

చైనీస్ ఫాస్ట్ ఫుడ్ తినడం చాలా మందికి అలవాటుగా మారింది. చవకలో తొందరగా తినొచ్చని భావించే ఆహారంలో సోడియం ఎక్కువ ఉంటుంది. సాస్ లు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి ప్రమాదకరమే.

Read more RELATED
Recommended to you

Latest news