హైదరాబాద్ – మహబూబ్ నగర్ -రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో సురభీ వాణీ దేవి గెలుపొందారు. అయితే ఆమె గెలుపుతో సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ కోల్పోయినట్టయింది. ఇక్కడ బీజేపీ నుండి రామచంద్రరావు పోటీ చేయగా ఆయన దాదాపు 11 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక నల్గొండ – ఖమ్మం – వరంగల్ స్థానంలో కూడా గెలుపు దిశగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు.
తన ప్రత్యర్థి తీన్మార్ మల్లన్న మీద ఆయన ఆధిక్యం కనబరుస్తున్నారు. దాదాపు 24 వేల ఓట్ల తేడాతో ఇద్దరూ ఉన్నారు. నిజానికి ఈ రెండు స్థానాల్లో ఒక చోట ప్రొఫెసర్ నాగేశ్వర్, మరో చోట ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేయడంతో ఈ రెండు స్థానాల్లో వారిద్దరే గెలుస్తారని అందరూ భావించారు. అయితే రెండు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థిలు గెలిచే పరిస్థితి కనిపించడం ఆశ్చర్యకరంగా మారింది.