పీరియడ్స్ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు…!

-

ప్రతినెలా ఆడవారు ఎదుర్కొంటున్న అతిముఖ్యమైన సమస్య బహిష్టు సమయంలో వచ్చే కడుపు నొప్పి. బహిష్టు సమయంలో కడుపునొప్పిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అది ఎందుకొస్తుందో తెలుసుకుని తగిన చికిత్స తీసుకోవాలి. సాధారణంగా యుక్త వయసు వారిలో అంటే 14-25 ఏళ్ల మధ్య ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది. ఇక మధ్య వయసు వారి విషయానికొస్తే..

ఒక్కోసారి ఇతర వ్యాధులేమైనా కూడా కారణం కావొచ్చు. కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల వల్ల కూడా నొప్పి వస్తుంది. బహిష్టు సమయంలో వ్యక్తిగత శుభ్రత ఎక్కువగా పాటించడం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుకోవచ్చు. పొత్తి కడుపులో తెరలుతెరలుగా నొప్పి మొదలై వాంతులు, వికారం, నడుమునొప్పి, తొడల భాగంలో నొప్పి కూడా ఉండొచ్చు. కొద్దిమందిలో మల బద్ధకం, విరోచనాలు, ఆకలి లేకపోవడం,

చిరాకు, అసహనం, నిరాసక్తత వంటి లక్షణాలూ కనిపిస్తాయి. ఆ సమయంలో కుటుంబ సభ్యులు సమస్యను అర్థం చేసుకుని సానుభూతితో వ్యవహరించాలి. తగినంత విశ్రాంతి ఇవ్వాలి. వేడినీళ్ల స్నానం చేయడం.. పొత్తికడుపు, నడుము మధ్య వేడినీళ్ల బ్యాగుతో కాపడం పెడితే కొంత ఉపశమనం కలుగుతుంది. క్రమంతప్పని వ్యాయామం.. కాఫీ వినియోగం తగ్గించడం, ఆహారంలో ఉప్పు తగ్గించడం వల్ల రక్త సరఫరా పెరిగి నొప్పి తీవ్రత తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news