ఉద్యోగం చేసే గర్భిణులు వీటిని ఫాలో అయితే సమస్యలే వుండవు..!

-

గర్భిణీలు తొమ్మిది నెలలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ సరైన మందులు కూడా వాడుతూ ఉండాలి. అయితే వర్క్ చేసే వారు ప్రెగ్నెంట్ అయితే ఉద్యోగం మానేయక్కర్లేదు. ఉద్యోగం చేసుకుంటూ కూడా తొమ్మిది నెలలు ఉండొచ్చు. ఆఖరి ట్రైమిస్టర్ వరకూ కూడా వర్క్ చేసుకోచ్చు.

 

ఎప్పటి వరకు అయితే వాళ్ళు వర్క్ చేయాలనుకుంటున్నారో అప్పటి వరకు కూడా కొనసాగించవచ్చు. కొందరు గర్భిణీలు డ్యూ డేట్ కి కొన్ని రోజుల ముందు వరకూ పని చేసి కొన్ని వారాలు ఉందనగా ఆపేస్తారు. అయితే మీరు ఎలా వర్క్ చేయాలనుకున్నా సరే ఆరోగ్యంగా ఉండడానికి టిప్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. అలానే వర్క్ వల్ల కూడా ఇబ్బంది రాకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం:

గర్భిణీలు మంచి ఆహారం తీసుకుంటూ ఉండాలి. దీనితో వాళ్లు ఎనర్జీ కోల్పోకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఉపవాసాలు చేయడం ఎక్కువ గ్యాప్ తీసుకుని ఆహారం తీసుకోవడం మంచిది కాదు. ఆరోగ్యకరమైన స్నాక్స్ కూడా తీసుకోవచ్చు. అలానే పచ్చి కూరగాయలు, పండ్లు, పెరుగు, బెల్లం, సోయా, పాలు, గుడ్లు వంటివి తీసుకోవచ్చు.

బాగా నిద్రపోండి:

బాగా నిద్ర పోవడం వల్ల మీ ఆరోగ్యం మరియు కడుపులో ఉండే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది. సరిగ్గా నిద్ర ఉంటే ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఇబ్బందులు రావు.

సీటింగ్ అరేంజ్మెంట్:

మీరు ఎప్పుడూ కూడా మీరు పనిచేసేటప్పుడు కంఫర్ట్ గా కూర్చోండి. మీ వీపు కి ఒక దిండు పెట్టుకోండి. కంప్యూటర్ మీద వర్క్ చేసేటప్పుడు రెండు చేతులు కంఫర్ట్ గా ఉంచండి. అలానే సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇలా ఈ తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే వర్క్ చేసే గర్భిణీలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version