నిద్రపోవడానికి అరగంట ముందు ఫోన్ ని పక్కన పెట్టకపోతే ఈ సమస్యలు వస్తాయ్…!

ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ల వాడకం బాగా పెరిగిపోయింది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ స్మార్ట్ ఫోన్ కి బాగా అలవాటు పడిపోయారు. క్షణం తీరిక ఉన్నా సరే స్మార్ట్ ఫోన్ తో బిజీ అయిపోతున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ ని ఎక్కువ వాడడం వల్ల చాలా సమస్యలు వస్తాయి.

 

ముఖ్యంగా రాత్రి నిద్ర పోవడానికి అరగంట ముందు స్మార్ట్ ఫోన్ ని ఆపేసి అప్పుడు నిద్ర పోవడం మంచిది. నిద్రపోవడానికి అరగంట ముందు మీరు స్మార్ట్ ఫోన్ కి దూరంగా ఉండకపోతే ఈ ఇబ్బందులు తప్పక వస్తాయి. అయితే మరి ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మరి ఇప్పుడు ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం చూసేయండి.

నిద్రలేమి సమస్యలు:

నిద్రపోవడానికి అరగంట ముందు ఫోన్ ని ఆపేయండి. లేదు అంటే ఫోన్ ద్వారా వచ్చే కాంతి కారణంగా నిద్రలేమి సమస్యలు వస్తాయి. కాబట్టి నిద్ర పోవడానికి అరగంట ముందే ఫోన్ ని ఆపేయండి.

క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది:

ఎక్కువ ఫోన్ వాడడం వల్ల క్యాన్సర్ ముప్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫోన్ ద్వారా ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ రేస్ వస్తాయి. దీంతో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బ్రెయిన్ మరియు చెవిలో ట్యూమర్స్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

సంతాన సమస్యలు:

చాలా మంది ఫోన్ ని జేబులో పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఫోన్ ద్వారా వచ్చే ఎలెక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ని తగ్గిస్తుంది. ఇలా ఎన్నో సమస్యలు ఫోన్ ద్వారా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఫోన్ కి దూరంగా ఉండటం మంచిది లేదు అంటే ఈ సమస్యలు తప్పవు.