మీలో అకలి పెరుగుతుందా? ఐతే అది ప్రోటీన్ లోపం కావచ్చు.. ఒక్కసారి చెక్ చేసుకోండి.

మన శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. శరీరానికి కావాల్సినంత ప్రోటీన్ అందకపోతే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్ల ప్రోటీన్ అధికంగా ఉండే , మీరు ధాన్యాలు, కాయలు, విత్తనాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఐతే మీలో ప్రోటీన్ లోపం ఉన్నట్లయితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకోండి.

 

ఆకలి పెరగడం

శరీరం సరిగ్గా పనిచేయడానికి ప్రోటీన్ అవసరం. అది సరిగ్గా అందకపోతే గనక ఆకలి ఎక్కువవుతూ ఉంటుంది. దానివల్ల అనవసరమైన ఆహారాలు, జంక్ ఫుడ్ తింటారు. అది ఊబకాయం వంటి సమస్యలకు దారి తీస్తుంది.

జుట్టు, గోర్లు బలహీనంగా మారడం

మీ జుట్టు, గోళ్ళు బలహీనంగా మారాయని మీకనిపిస్తే మీలో ప్రోటీన్ లోపం ఉన్నట్టే లెక్క. ప్రోటీన్ లోపం లేని వాళ్ళలో జుట్టు, గోర్లు బలంగా ఉంటాయి.

చర్మంపై ముడుతలు

ప్రోటీన్ లోపం శరీరం సరిగ్గా పనిచేయకపోవడమే కాదు చర్మంపై ముడుతలు వచ్చేలా చేస్తుంది. వృద్ధాప్య ఛాయలు తొందరగా రావడానికి ప్రోటీన్ లోపం కూడా ఓ కారణమే. చర్మం దాని మృదుత్వాన్ని కోల్పోయి వయసు ముదిరినట్టుగా తయారవుతుంది. ఇలాంటప్పుడు మీరు జాగ్రత్త పడాలి.

ఎక్కువ అలసట

తక్కువ ప్రోటీన్ తీసుకునే వారు తొందరగా అలసిపోతారు. శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా అలసిపోతారు. మీరు చేస్తున్న పనుల్లో శారీరక ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్రోటీన్ లోపం ఉందేమో అని గమనించండి.

ఎముకల బలహీనత

ఎముకలు బలంగా ఉండడానికి కాల్షియం అవసరం అని అందరికీ తెలుసు. కానీ కాల్షియం శరీరానికి అందాలంటే సరైన ప్రోటీన్ శరీరానికి కావాలి. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకున్నప్పుడు ఎముకలు బలపడతాయని పరిశోధనలో తేలింది. అదే విధంగా తక్కువ ప్రోటీన్ కారణంగా ఎముకలు బలహీనంగా మారతాయని, అందుకే ప్రోటీన్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.