వాటర్ తాగినా, ఫ్రూట్ తిన్నా..మలబద్ధకం సమస్య వదలట్లేదా..సబ్జాగింజలు బెస్ట్..!

-

ఈ రోజుల్లో చాలామందికి కామన్ గా ఉండే సమస్యల్లో ఒకటి మలబద్ధకం. దీని గురించి మాట్లాడుకోవడానికి సిగ్గుపడతారు. కానీ ఈ సమస్య ఉండటం అనేది మంచి విషయం కాదు..అనేక రోగాలకు ఇదే మొదలు..సుఖవిరోచనం కాకుండా ఉంటే..ప్రేగుల్లో మలం గట్టిపడి అతికష్టంమీద మోషన్ అవుతుంది. పావుగంట, అరగంట కుర్చోని నానాతంటాలు పడుతుంటారు..ఇలాంటి అవస్థల నుంచి బయటపడేయటానికే ప్రకృతి పరంగా ఏం ఏం చేయొచ్చో ఈరోజు తెలుసుకుందాం.

సబ్జాగింజలు ఈ సమస్యకు అద్భుతంగా పనికొస్తాయి. కొంతమందికి వాటర్ తాగినా, ఫ్రూట్స్ తిన్నా మలబద్ధకం సమస్యపోదు..అలాంటివారికి సబ్జాగింజలు బాగా ఉపయోగపడుతుంది.. ప్రేగులను క్లీన్ చేయాలంటే..మన బాడీకి చీపురులా పనికొచ్చేవి పీచుపదార్థాలు..ఇవి రెండు రకాలు..జీర్ణంమయ్యే పీచు, జీర్ణంకాని పీచు..ఈ రెండు రకాలు పీచులు ఉన్న ఆహారాలుు ఎక్కువగా తీసుకోవాలి. సబ్జాగింజలు ఇలాంటి సమస్య నుంచి బయటపడటానికి సుఖవిరోచనానికి బాగా ఉపయోగపడతాయి.

ఒక స్పూన్ గింజలు తీసుకుంటేనే అందులో 6 గ్రాములు పీచుపదార్థాలు ఉంటాయి. 100 గ్రాముల కొర్రలు తీసుకుంటే..9గ్రాములు పీచులు ఉంటాయి..అలాగే కూరగాయల్లోనూ 2-4 గ్రాములు ఉంటాయి..మరీ ఒక స్పూన్ అంటే..15గ్రాములు గింజలే. ఇవి సాలిబుల్ ఫైబర్. సబ్జాగింజల వాడకం అనేది అన్ని వయసుల వారికి మంచిది. చంటిపిల్లలు కూడా మలం సరిగ్గా రాక..ముక్కుతూ తెగ ఇబ్బంది పడతారు. పెద్దలకు కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
సబ్జాగింజల్లో ఉండే సాలిబుల్ ఫైబర్స్ అనేది..వాటర్ ను పీల్చుకుంటాయి. 8 రెట్లు ఎక్కువ వాటర్ ను పీల్చుకుని కాపాసిటీ సబ్జాగింజలకు ఉంటుందట.

వీటిని ఎలా తీసుకోవచ్చు.?

చంటిపిల్లలకు మోషన్ సమస్య ఉన్నప్పుడు..నీళ్లలో సబ్జాగింజలు వేయండి. లేదా పండ్లరసంలో అయినా ఒక స్పూన్ వేసి అరగంట వేసి నాననివ్వండి. అప్పుడు తాగించండి.

నీళ్లలో సబ్జాగింజలు, తేనె వేసి ఇచ్చి తాగించినా పిల్లలు ఇష్టంగా తాగుతారు. రోజుకు రెండు స్పూన్లు తాగించండి.

పెద్దవాళ్లు అయితే..ఒకటిన్నర స్పూన్ చొప్పున అయినా..రోజుకు రెండుసార్లు తాగొచ్చు. కొబ్బరినీళ్లలో, చెరుకురసంలో వేసి తాగొచ్చు. ఇలా ఎందులో అయినా..సబ్జాగింజలు రోజుకు మూడు స్పూన్లు వేసుకుని తాగొచ్చు.

ప్రేగుల వాతావరణం క్లీన్ గా ఉండాలంటే..ప్రేగుల్లో మలం నిల్వ ఉండకూడదు. నిల్వ ఉన్న మలం నుంచి చెడ్డ సూక్ష్మజీవులు, బాక్టీరియాలు విపరీతంగా పెరిగిపోయి రక్షణవ్యవస్థ మీద ప్రభావం చూపిస్తాయి. ఇళ్లు క్లీన్ గా లేకపోతే మనకు ఎలా ఉంటుంది. చూస్తూ ఊరుకోం కదా..మరి మనబాడీలో కూడా అలాంటి అపరిశుభ్రమైన వాతావరణం ఉంటే ఎలా? రోజు ఫ్రీగా మోషన్ అవ్వాలంటే సబ్జాగింజలను మూడు స్పూన్లు వాడుకుంటే చాలు.

వీటితోపాటు..నీళ్లు మోషన్ అవ్వాలనుకేవారు ఎలా తాగాలంటే..గోరు వెచ్చని నీరు తీసుకోండి..లీటర్ నుంచి లీటర్ పావు తీసుకుని ఒక సారి ఎన్ని త్రాగగలిగితే..అన్ని తాగేయండి. హెవీగా అనిపించింది అంటే ఆపేసి..కొంచెం సేపు అయ్యాక మళ్లీ తాగండి. అలా లీటర్ పావు వాటర్ ఆరు నిమిషాల్లో తాగేయండి. ఒత్తిడి బాగా ఎక్కువైపోతుంది..వెంటనే సుఖవిరోచనం అవుతుంది.

రెండుగంటలు గ్యాప్ ఇచ్చి..మళ్లా లీటర్ నీళ్లు తాగండి..ఉదయం పూట రెండుసార్లు సుఖ విరోచనం అ‌వడానికి ఈ చిట్కా పాటిస్తూ..లోపలికి పీచుపదార్థాలు ఉన్న ఆహారం పంపిస్తే..మలం ఎక్కువ తయారైతే..ఆ ప్రజర్ కు మలం స్పీడ్ గా వస్తుంది.

ముసలివారు చాలామంది మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అసలు ఈ సమస్య పురుషుల కంటే..స్త్రీలలోనే ఎక్కువ ఉంటుంది. అలాంటివారికి సబ్జాగింజలు ఎంతో మేలు చేస్తాయి కాబట్టి..ఈసారి ఈ ప్రయత్నం చేసి చూడండి అంటున్నారు ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news