తల్లిపాలల్లో మైక్రోప్లాస్టిక్స్​ గుర్తించిన శాస్త్రవేత్తలు..బిడ్డకు ప్రమాదమే..

-

తల్లిప్రేమ అంత స్వచ్ఛమైనది..తల్లిపాల అంత ఆరోగ్యమైనది మరొకటి ఉండదు అంటారు..కానీ తాజాగా జరిగిన పరిశోధనలో తల్లిపాలు బిడ్డపాలట విషంలా మారుతున్నాయని తేలింది. తల్లిపాలల్లో మైక్రోప్లాస్టిక్‌ పదార్థాలను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. వీటివల్ల బిడ్డ ఆరోగ్యానికి చాలా ప్రమాదమట.. ఈ విషయం ఇప్పుడు అందరిని ఆందోళనకు గురిచేస్తుంది. ఇలా తల్లిపాలు కల్తీ అవడానికి కారణం ఏంటంటే..

తల్లి పాలల్లో పాలిథైలీన్​, పీవీసీ, పాలిప్రొపిలీన్​ వంటి ప్యాకేజింగ్​లో వినియోగించే పదార్థాలను ఈ పరిశోధనలో కనుగొన్నారు. పరిశోధన కోసం ఇటలీ రోమ్​లో.. 34మంది ఆరోగ్యవంతులైన తల్లుల బ్రెస్ట్​ మిల్క్​ని సేకరించారు. వీరందరు.. బిడ్డ పుట్టిన వారం రోజుల తర్వాత.. పాలను పరిశోధనకు ఇచ్చారు. వీటిల్లో 75 శాతం మందిలో మైక్రోప్లాస్టిక్స్​ పదార్థాలను గుర్తించామని పరిశోధకులు తెలిపారు.

మైక్రోప్లాస్టిక్స్​తో మానవ కణాలు, జంతువులు, వణ్యప్రాణుల్లో కలిగే నష్టాలను గతంలో ఎన్నో పరిశోధనలు వెల్లడించాయి. . ప్లాస్టిక్​లో ఎన్నో కలుషిత పదార్థాలు ఉంటాయి. అవి ఇప్పుడు తల్లి పాలల్లో కూడా కనిపించడం మానవాళికి పొంచి ఉన్న ప్రమాదానికి నిదర్శనం.

కారణం ఇదానే..?

ప్లాస్టిక్​ ప్యాకేజింగ్​తో కూడిన పదార్థాల్లోని ఆహారాన్ని సేవించడం, సీ ఫుడ్​ తినడం, ప్లాస్టిక్​తో కూడిన పర్సనల్​ హైజీన్​ ఉత్పత్తులు వినియోగించడానికి.. తల్లి పాలల్లో మైక్రోప్లాస్టిక్​ ఉనికికి సంబంధం లేదని పరిశోధకులు అన్నారు. కానీ పర్యావరణంలోనే మైక్రోప్లాస్టిక్స్​ ఉండటంతో మనిషికి ప్రమాదం అన్నారు.

ఇటలీలోనే 2020లో మనిషి ప్లసెంటాలో మైక్రోప్లాస్టిక్ పదార్థాలను కనుగొన్నారు. ఇక తాజా పరిశోధనతో.. తల్లి పాలల్లోకి కూడా మైక్రోప్లాస్టిక్ చేరిందని స్పష్టమైంది.

ప్రెగ్నెన్సీ, లాక్టేషన్​లో ఈ కలుషితాన్ని తొలగించే పద్ధతులను ప్రవేశపెట్టడం కీలకం. తల్లి పాలల్లో మైక్రోప్లాస్టిక్స్​ ఉన్నప్పటికీ.. వాటి కన్నా తల్లి పాలు పిల్లలకు అందకపోవడమే ఎక్కువ ప్రమాదకరం. తల్లి పాలు ఇవ్వకండి అని చెప్పడం తమ పరిశోధన ఉద్దేశం కాదు. రాజకీయ నేతలు, చట్టసభ్యులు.. పర్యావరణ పరిరక్షణకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు చట్టాలు తీసుకురావాలని పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు తెలిపారు.

ప్లాస్టిక్​ పదార్థాలతో ప్యాకింగ్​ చేసిన ఆహారం, మంచి నీరును వినియోగించకూడదని పరిశోధకులు తల్లులకు సూచిస్తున్నారు. మైక్రోప్లాస్టిక్స్​తో కూడిన కాస్మొటిక్స్​, టూత్​పేస్ట్​లను వాడకూడదని తెలిపారు. బాటిళ్లల్లో బిడ్డలకు పాలు పడితే.. భారీ మొత్తంలో మైక్రోప్లాస్టిక్స్​ వారిలోకి ప్రవేశిస్తాయని, తల్లి పాలే శ్రేయస్కరం అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news