వృద్ధులకు వరంగా మారుతున్న వయాగ్రా.. మంచిదేనంటున్న శాస్త్రవేత్తలు.!

-

యవ్వనంలో ఉన్నప్పుడు వీలైనన్ని సార్లు శృంగారం చేయాలి. నిజానికి సెక్స్‌ అనేది పెళ్లి తర్వాతే చేయాలని రూలేం లేదు. కానీ మన దగ్గర శృంగారం అనేది ఒక నైతికవిలువకు అద్దం. పెళ్లికి ముందే శృంగారం చేస్తే వాళ్లు చెడ్డవాళ్లు, క్యారెక్టర్‌ లేదని అనుకుంటారు. ఇది కూడా ఎంజాయ్‌మెంట్‌లో ఒక భాగం మాత్రమే. కానీ ఇలా అర్థం చేసుకునే మెంటాలిటీ చాలా మందికి లేదు కదా..! శృంగారం అనగానే మనకు గుర్తుకువచ్చేది కండోమ్‌ అయితే దాని తర్వాత వయాగ్రా ఉంటుంది. కొంతమంది రతిలీ రెచ్చిపోవడానికి వయాగ్రా వాడుతుంటారు. వయగ్రా శృంగారానికి ఎలా పనిచేస్తుందో అంత కంటే ఎక్కువగా ఇతర సమస్యలకు కూడా పనిచేస్తుంది.! 70, 80 సంవత్సరాల తర్వాత కూడా లైంగికంగా చురుకుగా ఉండాలని కోరుకునే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి.

పోయిన సంవత్సరం కంటే ఈ ఏడాది 80 సంవత్సరాలు పైబడిన పురుషులకు వయగ్రా మందులు దాదాపుగా రెండు లక్షల పైగా ప్రిస్క్రిప్షన్లు బయటపడ్డాట. ఆశ్చర్యకరంగా పశ్చిమదేశాల్లో 99, 102 సంవత్సరాల పురుషులు కూడా ఇంకా ఆ విషయంలో చురుకుగా ఉండాలని ఆశిస్తున్నారట. ముసలోళ్లే కానీ మహానుభావులే.!

2016లో 127,448 నుంచి గత సంవత్సరం 196,867 కి పెరిగాయని లెక్కలు చూపుతున్నారు అక్కడి వైద్య నిపుణులు. 60 సంవత్సరాల పైబడిన వారు వయాగ్ర వాడుతున్న వారిలో ఎక్కువగా ఉన్నారట. ప్రతి 40 మంది పురుషుల్లో ఒకరు ఈ మందు వాడుతున్నారు. అయితే ఇప్పటి వరకు వయాగ్రా గుండె ఆరోగ్యానికి చేటు చేస్తుందని భావించేవారు. కానీ ఇప్పుడు ఇందుకు విరుద్ధంగా గుండె ఆరోగ్యానికి మంచిదని లండన్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌కు చెందిన యూరాలజిస్ట్ గోర్డాన్ ముయిర్ చెబుతున్నారు. ఈ మందులు వాడుతున్న పెద్ద వయసు పురుషుల్లో గుండె సమస్యల ప్రమాదం చాలా తగ్గిందని రక్తనాళాలు ఆరోగ్యంగా ఉన్నాయి, డిప్రెషన్ లేకపోవడం, ఒత్తిడి తక్కువగా ఉండడం కూడా గమనించారట. అయితే వయాగ్రా వాడేముందు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం. వయాగ్రా వల్ల కచ్చితంగా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news