పవనో రక్షిత రక్షితః..బాబుని బీజేపీతో కలుపుతారా?

-

కేంద్రంలో అటు ఎన్డీయే, ఇటు యూపీఏ పక్షాల సమావేశాలు పోటాపోటిగా జరుగుతున్న విషయం తెలిసిందే. రానున్న ఎన్నికలకు సిద్ధమయ్యే నేపథ్యంలో అధికార, విపక్షాలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో ఎన్డీయే, బెంగళూరులో యూపీఏ పక్షాల సమావేశాలు జరుగుతున్నాయి. ఎవరికి వారు తమ బలాన్ని పెంచుకుని కేంద్రంలో అధికారంలోకి రావాలని చూస్తున్నారు. అయితే ఈ రెండు పక్షాలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతీయ పార్టీలైన టి‌డి‌పి, వైసీపీ, బి‌ఆర్‌ఎస్ లని ఆహ్వానించలేదు.

వైసీపీ పరోక్షంగా బి‌జే‌పికి మద్ధతు ఇస్తున్న..అధికారికంగా ఆ పార్టీతో లేదు. ఇటు కే‌సి‌ఆర్..బి‌జే‌పిపై ఫైట్ చేస్తున్నా సరే..విపక్షాలతో కలవడం లేదు. ఇక చంద్రబాబు న్యూట్రల్‌గా ఉండిపోయారు..కాకపోతే బి‌జే‌పితో పొత్తు కోసం చూస్తున్నారు..కానీ ఆ పార్టీ పిలవలేదు. కానీ ఏపీలో బి‌జే‌పితో జనసేన పొత్తులో ఉంది..దీంతో పవన్‌కు ఎన్డీయే మీటింగ్‌కు ఆహ్వానం వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీకి వెళ్లారు. మీటింగ్‌లో పాల్గొంటారు. ఇక ఈ మీటింగ్ తర్వాత పొత్తులపై కాస్త క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే అక్కడ జరిగే చర్చ బట్టే పొత్తులు మారతాయి.

అయితే బి‌జే‌పి మాత్రం టి‌డి‌పితో కలవడానికి రెడీగా లేదు. పవన్ మాత్రం టి‌డి‌పితో కలిస్తేనే వైసీపీకి చెక్ పెట్టి అధికారం సొంతం చేసుకోగలమని భావిస్తున్నారు. అందుకే టి‌డి‌పిని బి‌జే‌పితో కలపాలని చూస్తున్నారు. అలా కుదిరితే ఇబ్బంది ఉండదు..కుదరని పక్షంలో పవన్ బి‌జే‌పిని వదిలేసి టి‌డి‌పితో వస్తారా? లేదా టి‌డి‌పిని పక్కన పెట్టి..బి‌జే‌పితో వెళ్తారా? అనేది చూడాలి.

కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి..బి‌జే‌పితో కలవడం వల్ల ఈ సారి ఎన్నికల్లో పవన్ సత్తా చాటలేరు..అందులో డౌట్ లేదు. టి‌డి‌పితో కలిస్తే కాస్త ఛాన్స్ ఉంది. అందుకే బాబుని బి‌జే‌పికి దగ్గర చేయాలనే చూస్తున్నారు. మొత్తానికి పవనే..బాబుకు కీ అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news