రాత్రిళ్లు భోజనం తినడం మానేసినవారికి షాకింగ్ న్యూస్

-

ఇప్పుడు వెయిట్ తగ్గాలనుకునేవారు.. ముందు చేసే పని నైట్ రైస్ మానేయడం. అన్నం తినటం తగ్గించేయండి. చాలామంది లిక్విడ్ ఫుడ్ మాత్రమే తీసుకుంటారు. ఒక్క పూట మాత్రమే భోజనం చేయడం..
రోజులో అల్పహారం.. మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రిళ్లు భోజనం చేయడం మానేస్తున్నారు. దీంతో బరువు తగ్గిపోతారు అనే అపోహా చాలా మందిలో ఉంది. అయితే రాత్రిళ్లు భోజనం మానేయడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదట. అనారోగ్య సమస్యలతోపాటు.. బలహీనంగా మారిపోతుంటారు. ఇంకా నిపుణులు ఏం అంటున్నారంటే..
నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉదయం అల్పాహరం చేయడం.. మధ్యాహ్నం భోజనం చేయడం.. రాత్రిళ్లు భోజనానికి చాలా గ్యాప్ ఉంటుంది. దీంతో ఒక్కపూట భోజనం చేయటం వల్ల బలహీనంగా మారిపోతుంటారు. ముఖ్యంగా రాత్రిళ్లు భోజనం మానేస్తే.. శరీరానికి తగినంత పోషకాలు అందవు.. దీంతో బలహీనంగా ఉంటారు. బరువు తగ్గడం కోసం డైట్ ఫాలో అవుతున్నవారు.. రాత్రిళ్లు తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ఫ్రూట్స్ లేదా జ్యూస్ లేదా..మరేదైనా..డ్రై నట్స్ లాంటివి నానపెట్టుకుని తినండి.అంతేకాదనీ. మొత్తానికి పొట్టకు రెస్ట్ ఇస్తే.. రాత్రి ఆకలి తీరదు.. అలాగే.. నిద్రపోతున్న సమయంలో కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. దీంతో నిద్ర పూర్తిగా ఉండదు. ఆరోగ్యం దెబ్బతింటుంది.
రాత్రిళ్ళు భోజనం చేయకపోవడం వలన రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇది ఆరోగ్యంపై ప్రభావితం చేయడమే కాకుండా.. రక్తహీనత, బలహీనత, తలతిరగడం.. తర్వగా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. అందుకే రాత్రిళ్లు భోజనం మానివేయకుండా.. తేలికపాటి ఆహారం తీసుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.
 బరువు తగ్గటం ఎంత ముఖ్యమో.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం..లేదంటే మొఖం పేలగా, అందవికారంగా అవడమే కాదు..అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రొటీన్ ఉన్న ఫుడ్ తీసుకుంటూ..ఫ్యాట్, కార్భోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తగ్గిస్తూ…మంచి జీవనశైలీతో బరువు ఈజీగా తగ్గొచ్చు. ఉదయం మొలకు, కొబ్బరి, రెండు మూడు రకాల పండ్లు..మధ్యాహ్నం పుల్కాలు కూర ఎక్కువగా వేసుకుని తినేసి..సాయంత్రం 7 గంటలకంతా..ఏదో ఒక నాలుగు రకలా పండ్లు, నానపెట్టిన డ్రైనట్స్ కడపునిండా తింటే..ఆకలి వేయదు..ఎలాంటి సమస్యలు రావు.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news