ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే క్యాన్సర్ తీవ్రతను పెంచుతున్నట్టే..!

-

జీవన విధానం లో మార్పులు మరియు ఆహరం లో మార్పుల వలన రోజు రోజు కు ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మహిళలు ఆరోగ్యం ఎంతో దెబ్బతింటోంది. ఈ మధ్యకాలంలో మహిళల్లో అండాశయ క్యాన్సర్ సమస్య ఎక్కువగా వస్తోంది. పైగా ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్యతో బాధపడే మహిళల సంఖ్య ఎక్కువ అవుతోంది. అయితే ఈ సమస్యను సకాలంలో గుర్తించకపోతే తీవ్రత మరింత ఎక్కువ అవుతుంది. కనుక అండాశయ క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలను ముందుగానే తెలుసుకుంటే చికిత్స చేయడం కూడా ఎంతో సులభం అవుతుంది అని డాక్టర్లు చెబుతున్నారు. అందువల్ల అండాశయ క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలను తెలుసుకోవడం ఎంతో అవసరం.

ఈ సమస్యను ఎదుర్కొన్నప్పుడు గర్భాశయం చుట్టూ ఉండే పొత్తికడుపు లో అసౌకర్యం ఏర్పడుతుంది మరియు నొప్పి లేక సున్నితంగా అనిపించడం జరుగుతుంది. ఇటువంటి లక్షణాలను తేలికగా తీసుకుంటే పొరపాటు చేసినట్టే. కనుక పొత్తికడుపు దగ్గర నొప్పిగా ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం ఎంతో అవసరం. అదేవిధంగా కొంచెం మోతాదులో ఆహారాన్ని తీసుకున్నా కడుపు నిండినట్లు అనిపించడం లేక తినడానికి ఇబ్బంది కలగడం వంటివి ఎదురైతే అండాశయ క్యాన్సర్ లక్షణాలుగా భావించాలి. ఈ క్యాన్సర్‌ను ఎదుర్కొన్నవారు ఎంతో త్వరగా అలసిపోయి బలహీనంగా మారుతారు. ముఖ్యంగా హార్మోన్ల స్థాయిలు, ప్రోటీన్లు మారతాయి మరియు శరీరంలో వాపు మొదలవుతుంది.

ఈ విధంగా భరించలేని నొప్పి కలుగుతుంది. ఈ క్యాన్సర్‌ ను ఎదుర్కొన్న మహిళలు నొప్పితో బాధపడాల్సి ఉంటుంది. దాని వలన నిద్ర పై కూడా ప్రభావం పడుతుంది. అండాశయ క్యాన్సర్‌ను ఎదుర్కొన్నప్పుడు తరచూ మూత్ర విసర్జన అవడం లేక మూత్రంలో రంగు మారడం వంటివి ఎదురవుతాయి. కనుక ఇటువంటి లక్షణాలను ఎదుర్కొన్నట్లయితే కచ్చితంగా డాక్టర్ ను సంప్రదించి సరైన చికిత్స చేయించుకోవడం ఎంతో అవసరం. ఇలా సకాలంలో తగిన చర్యలను తీసుకుంటే క్యాన్సర్ తీవ్రత తక్కువగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news