లక్ష్మణఫలం తినండి.. 12 రకాల కేన్సర్ కారక కణాలను తరిమికొట్టండి..!

-

లక్ష్మణఫలం. పేరు విన్నారా ఎప్పుడైనా? ఎప్పుడో ఓసారి విన్నట్టుందే అంటారా? అవును.. సీతాఫలం తెలుసు కదా. దాని లాగానే లక్ష్మణఫలం అనే పండు కూడా ఉంటుంది. సేమ్ సీతాఫలం తిన్నట్టే ఉంటుంది కానీ.. దీంట్లో ఉండే ఔషధ గుణాలు మాత్రం ఎక్కువే అని చెప్పుకోవాలి.

ఈ చెట్లు ఎక్కువగా బ్రెజిల్, మెక్సికో, క్యూబా లాంటి దేశాల్లో కనిపిస్తాయి. అయితే.. భారత్‌లోనూ ఈమధ్య ఈ చెట్లు కనబడుతున్నాయి. ముఖ్యంగా అడవుల్లో కనిపిస్తున్నాయి. వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్‌లో ఆనోనా మ్యూరికాటా అని పిలుస్తారు. మొత్తం 12 రకాల కేన్సర్ కారక కణాలను ఈ పండు తరిమికొడుతుందట. ఒక్క పండే కాదు.. లక్ష్మణఫలం చెట్టు బెరడు, ఆకులు, విత్తనాలు.. ఇలా చెట్టు మొత్తం ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగపడుతుందట. కడుపులో పురుగులను చంపడానికి, విష జ్వరాలను తగ్గించడానికి కూడా ఈ పండు తినొచ్చట. ఇంకా.. ఈ పండులో విటమిన్ సీ, విటమిన్ బీ1, విటమిన్ బీ2.. పుష్కలంగా లభిస్తాయట. కండరాల నొప్పి తగ్గడానికి, బాలింతల్లో పాల వృద్ధికి, పార్శపు నొప్పి, షుగర్, మూత్రకోశ వ్యాధుల చికిత్సలోనూ లక్ష్మణఫలాన్ని ఉపయోగిస్తారట.

ఇన్ని లాభాలు ఉన్న ఈ పండు గురించి ఎక్కువగా ఎవరికీ తెలియదు. కానీ.. ఇప్పుడిప్పుడు ఈ పండు లాభాలు తెలిసి ఆంధ్రాలోని విశాఖపట్టణం ఏరియాలో వీటిని సాగు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఎక్కువ వీటిని పండిస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news