మిరాకిల్ విమెన్.. 36 ఏళ్లు.. 7 కణితులు.. 5 క్యాన్సర్లు..

-

స్పెయిన్‌కు చెందిన ఒక మహిళ ఉదంతం వైద్యరంగాన్నే ఆశ్చర్యపరిచింది. 36 ఏళ్లు వచ్చేసరికి 12 రకాల ట్యూమర్లు ఎదుర్కొంది. ఆమె జన్యువులను తరచి చూసిన పరిశోధకులకు మానవుల్లో ఎన్నడూ చూడని మార్పులు కనిపించాయి. ఆమె ఇప్పటిదాక ఎలా బతికిందో వారికి అంతుబట్టడం లేదు.

  • రెండేళ్ల వయసులో ఆమె తొలిసారి క్యాన్సర్‌ బారినపడింది.
  • 15 ఏళ్లు వచ్చేసరికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ తలెత్తింది.
  • మరో ఐదేళ్లకు లాలాజల గ్రంథిలో కణితి వచ్చింది. దీంతో ఆ అవయవాన్ని వైద్యులు తొలగించారు.
  • 21 ఏళ్ల ప్రాయంలో డాక్టర్లు మరో శస్త్రచికిత్స చేసి ఆమెలో ‘లో గ్రేడ్‌ సార్కోమా’ను తీసివేశారు.
  • తర్వాత కూడా భిన్న రకాల కణితులను ఆమె ఎదుర్కొంది. మొత్తం మీద 12 రకాల ట్యూమర్లు విరుచుకుపడ్డాయి. వీటిలో ఐదు క్యాన్సర్‌ కణితులు ఉన్నాయి.

బాధితురాలిలో ఇన్ని రకాల ట్యూమర్లు రావడంపై ఆశ్చర్యానికి లోనైన అంతర్జాతీయ శాస్త్రవేత్తలు.. దానికి మూలాలను గుర్తించాలని నిర్ణయించారు. ఈ బృందానికి స్పెయిన్‌కు చెందిన నేషనల్‌ క్యాన్సర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు నేతృత్వం వహించారు. బాధితురాలి నుంచి రక్త నమూనాలు సేకరించి పరిశీలించారు. ఆమె కణాల్లోని ఎంఏడీ1ఎల్‌1 అనే జన్యువులో రెండు ప్రతుల్లోనూ ఉత్పరివర్తన కనిపించడం శాస్త్రవేత్తలను విస్మయానికి గురిచేసింది.

ఎంఏడీ1ఎల్‌ జన్యువులో ఉత్పరివర్తనాలు కొత్తేమీ కాదు. ఈ జన్యువుకు సంబంధించిన రెండు ప్రతుల్లో ఒకదానిలోనే ఆ మార్పులు కనిపిస్తుంటాయి. బాధితురాలిలో మాత్రం రెండు ప్రతుల్లోనూ వైరుధ్యం కనిపించింది. మానవుల్లో ఇలాంటి పరిస్థితి తలెత్తడం ఇదే మొదటిసారి. దీనివల్ల బాధితురాలిలో క్యాన్సర్‌ ముప్పు పెరుగుతున్నట్లు పరిశోధకులు తేల్చారు.

Read more RELATED
Recommended to you

Latest news