చాలా మంది ఆహార పదార్ధాలను ఎలా పడితే అలా తీసుకుంటూ ఉంటారు. దీనికారణంగా నష్టాలు ఉన్నా సరే పెద్దగా వాళ్ళు పట్టించుకునే ప్రయత్నం చేయరు. అయితే ఆహారాన్ని ఎలా పడితే అలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు అనేది వైద్యులు చెప్పే మాట. ప్రధానంగా ఆహరం తినే సమయంలో కొన్ని జాగ్రత్తలు అవసరమని అంటున్నారు. మాంసం, పాల ఉత్పత్తులు, చేపలు, వెన్న లేదా మీగడ కలిపి తినే ప్రయత్నం అసలు చేయకూడదు.
అదే విధంగా పాలు, గుడ్లు కలిపి తింటే మంచిది కాదు. పండ్లు, ఇతర ఆహార పదార్థాలను కూడా కలిపి తినకూడదు. ఇలా తినడం వల్ల జీర్ణకోశంలో వాయువులు తయారయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఫ్రూట్స్ ని ఎప్పుడు కాళీ కడుపుతోనే తినాలి… పండ్లు తిన్న రెండు గంటల తర్వాతే ఇతర పదార్ధాలు తినాలి. చల్లని, వేడి పదార్థాలు వెంటవెంటనే తీసుకోవడం మంచిది కాదు.
పెరుగు, కాఫీ, లేదా ఐస్‌క్రీమ్, టీ ఇలా రెండూ వెంటవెంటనే తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. భోజనం చేసే సమయంలో చల్లని నీరు తాగడం వలన జీర్ణాగ్ని చల్లారిపోయి జీర్ణక్రియ దెబ్బ తినే అవకాశం ఉంటుంది. తేనెను ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి పదార్థాల్లో కలిపి తినవద్దు. టీలో తేనె కలుపుకొని తాగడం వలన, చాలా నష్టాలు ఉన్నాయి. కొందరు పాలలో తేనె కలుపుకొని తాగడం వలన… తేనెలో కలిసి ఉండే మైనం విషంగా మారే ప్రమాదం ఉంది.