స్ట్రాబెర్రీస్ వలన కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా…?

-

స్ట్రాబెర్రీస్ లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. మన శరీరానికి అవసరం అయ్యే విటమిన్ సి ఈ పండ్లలో అధికంగా ఉంటుంది. స్ట్రాబెర్రీస్ గుండెకు ఎంతో మేలు చేస్తాయి, గుండెపోటు రాకుండా నివారిస్తాయి. ఈ పండ్లలో షుగర్ శాతం కూడా తక్కువే ఉంటుంది కాబట్టి డయాబెటిస్ ఉన్న వారు కూడా ఈ పండ్లను తినవచ్చు. తరచుగా స్ట్రాబెర్రీస్ ను తినడం వల్ల కంటి చూపు కూడా మెరుగు పడుతుంది. అంతే కాకుండా ఈ పండ్ల లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కు సంబంధించిన వ్యాధుల నుండి కాపాడుతాయి.

దద్దుర్లు, నిద్రలేమి, తల నొప్పి, అలర్జీలు ఉన్నవారు స్ట్రాబెర్రీలను తినకూడదు. స్ట్రాబెర్రీస్ లో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ గర్భిణీలకు ఎంతో అవసరమైన పోషకం, గర్భంలోని శిశువు వెన్నెముక కి సంబంధించిన లోపాలు ఉంటే ఈ పదార్థం వాటిని నివారిస్తుంది. ఫోలిక్ యాసిడ్ వల్ల ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందుతాయి మరియు మెదడు పని తీరు మెరుగు పడుతుంది.

స్ట్రాబెర్రీస్ తో పొట్టలో ఏర్పడేటువంటి అల్సర్ ని నివారించవచ్చు అని పరిశోధనలో తేలింది.
స్ట్రాబెర్రీస్ లో అధికంగా పీచు పదార్థం ఉంటుంది తరచుగా ఈ పండ్లను తినడం వల్ల వయసు
మీరినట్లు కనిపించరు. దాంతో పాటు చర్మం నిగారింపు పెరిగి, యవ్వనంగా కనబడుతారు
మరియు ఇటువంటి పీచు పదార్థాలు వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగు పడుతుంది. కనుక స్ట్రాబెర్రీస్ అందుబాటులో ఉన్నప్పుడు తప్పక తినండి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news