అధిక రక్తపోటుతో కిడ్నీలకు పోటు.. జాగ్రత్తలు పాటించకుంటే నష్టపోవాల్సిందే..!

-

ప్రస్తుత కాలంలో.. హై బీపీ బాధితులు చాలామంది ఉంటున్నారు. అయితే డయబెటీస్ పేషెంట్స్ కు కిడ్నీలు ఫెయిల్ అవుతాయని చాలామందికి తెలుసు కానీ. బీపీ పేషెంట్స్ కు కూడా కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఎవరికీ పెద్దగా తెలియదు. దీర్ఘకాలంగా అధిక రక్తపోటుతో బాధపడేవారిలో కిడ్నీలు దెబ్బతినే ముప్పు ఎక్కువ. నిర్లక్ష్యం చేస్తే చివరికి కిడ్నీ వైఫల్యమూ సంభవించొచ్చు.

అధిక రక్తపోటుతో కిడ్నీలు ఎలా దెబ్బతింటాయి?

అసలు సమస్య ధమనులు, కిడ్నీల్లోని సూక్ష్మ రక్తనాళాల గోడలు మందం కావటంలోనే ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ విషయంలో కిడ్నీల్లోని రెనిన్‌ కణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి రెనిన్‌ అనే హార్మోన్‌ను విడుదల చేస్తాయి. ఈ హార్మోన్‌ రక్తపోటు నియంత్రణలో ఉండటానికి తోడ్పడుతుంది.
రెనిన్‌ కణాల్లో హానికర మార్పులు సంభవించినప్పుడు ఇవి కిడ్నీల్లోని రక్తనాళాల గోడల్లోకి చొచ్చుకుపోతాయి. అప్పుడవి మృదు కండర కణాలనే మరో రకం కణాలు పోగయ్యేలా ప్రేరేపిస్తాయి.దీంతో రక్తనాళాల గోడలు మందమవుతాయి, గట్టిపడతాయి. ఫలితంగా రక్తనాళాలకు సాగే గుణం తగ్గిపోతుంది. కిడ్నీలకు రక్త ప్రవాహం అస్తవ్యస్తమవుతుంది, రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియ దెబ్బతింటుంది.
రక్తపోటు నియంత్రణకు డాక్టర్లు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడుకోవాలి. మంచి జీవనశైలిని అలవరచుకోవాలి. ముఖ్యంగా ఉప్పు వాడకం తగ్గించాలి. సిగరెట్లు కాల్చే అలవాటు ఉంటే.. మానేయ్యాలి. మద్యం జోలికి అసలే వెళ్లకూడదు. ఆ చెప్పినా మాత్రం వింటారా ఏంటి..? కొందరు తెలిసితప్పు చేస్తే.. మరికొందరు తెలియక, అవగాహన లేమితో తప్పు చేస్తారు. వారికోసమే మా ప్రయత్నం. మద్యపానం అలవాటు ఉంటే.. కంట్రోల్ లో ఉండేలా చూసుకోవాలి. మితిమీరు తాగకూడదు.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒక మాదిరి వ్యాయామమైనా రక్తపోటు తగ్గటానికి తోడ్పడుతుంది. బరువు అదుపులో ఉంచుకోవాలి. కేవలం 5% బరువు తగ్గినా రక్తపోటు తగ్గుముఖం పడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి మేలు చేస్తాయి..ఇంకా బీపీ పేషెంట్స్ టీ తక్కువగా తాగాలి, నిద్రసరిపడా పోవాలని వైద్యులు చెప్తున్నారు.
మన శరీరంలో లివర్ డామేజ్ అయితే.. మళ్లీ మంచి ఆహారం అందిస్తే.. ఆరునెలల్లో తిరిగి నార్మల్ స్టేజ్ కు వచ్చేస్తుంది. ఆ కాపాసిటీ లివర్ కు ఉంది.. కానీ కిడ్నాలు అలా కాదు..ఒక్క సారి దెబ్బితిన్నాయంటే.. ఆ మార్క్ ఉండిపోతుంది. పనితనం తగ్గుతుంది. కొద్దికొద్దిగా నష్టం పెరుగుతుంది. కాబట్టి.. కిడ్నీలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news