ఈ టిప్స్ ని అనుసరిస్తే స్ట్రోక్ రాదు..!

స్ట్రోక్ ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య. మన దేశంలోనే కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం స్ట్రోక్ తో చనిపోతూ ఉంటారు. ఎప్పుడైతే రక్తం యొక్క సరఫరా బ్రెయిన్ కి తక్కువ అవుతుందో అప్పుడే
స్ట్రోక్ వస్తుంది. బ్రెయిన్ డ్యామేజ్ మరియు మిగిలిన సమస్యలు రాకుండా ఉండాలంటే హెల్త్ చెకప్స్ తరచుగా చేసుకుంటూ ఉండాలి.

 

వాటికంటే ముఖ్యంగా అన్నీ జీవనశైలి ఎంతో మెరుగుపరుచుకోండి. ఎప్పుడైతే జీవన ప్రక్రియ బాగుంటుందో అప్పుడే గుండె జబ్బులు మరియు స్ట్రోక్స్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇక పూర్తి వివరాలలోకి వెళితే..

స్ట్రోక్ ని ఈ విధంగా తగ్గించుకోచ్చు:

బరువు తగ్గండి:

ఎప్పుడైతే సమాన బరువుతో మీరు ఉంటారో గుండెజబ్బులతో పాటు ఎటువంటి సమస్యలు రావు. అందుకని సరైన బరువు ఉండాలి.

బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ లో ఉంచుకోండి:

హై బీపీ వల్ల ఎన్నో సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ లో ఉంచుకోండి.

కొలెస్ట్రాల్ లెవెల్స్:

ఇది కూడా సరైన విధంగా ఉండేటట్లు చూసుకోవాలి. అధిక కొలెస్ట్రాల్ వల్ల ఊబకాయం సమస్య కూడా వస్తుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి.

స్మోకింగ్:

దీని వల్ల లంగ్స్ పై ఎంతో ప్రభావం పడుతుంది. దాని వల్ల శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులు వస్తాయి. కాబట్టి స్మోకింగ్ మానేస్తే మంచిది.

ఆల్కహాల్ ని తీసుకోవడం తగ్గించుకోండి:

ప్రతి రోజూ తప్పకుండా వ్యాయామాలు చేయండి. వ్యాయామాలు క్రమం తప్పకుండా చేస్తే ఆరోగ్యంగా ఉండచ్చు.