దోమలు రాకుండా ఇలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది..!

-

దోమకాటు కారణంగా జికా వైరస్ అనేది వ్యాపిస్తోంది. కేరళలో 24 ఏళ్ల గర్భిణీకి జికా వైరస్ వచ్చింది అయితే ఈజీగా వైరస్ దోమ Mosquito కాటు వల్ల వస్తుంది కనుక దోమలు కుట్టకుండా జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. చికెన్ గునియా, మలేరియా వంటి సమస్యలు ఎలా అయితే దోమల వల్ల వస్తాయో అదే విధంగా జికా వైరస్ కూడా వస్తుందని వైద్యులు అంటున్నారు.

 దోమలు/Mosquito
దోమలు/Mosquito

దోమలు కుట్టకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దోమలు ఉండకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి.

దోమ తెరలు వాడడం:

ఇంట్లో దోమ తెర ఉపయోగించడం వల్ల దోమలు కుట్టకుండా జాగ్రత్త పడొచ్చు. మంచానికి దోమతెర కట్టుకోవడం వల్ల లోపలకి దోమలు ప్రవేశించలేవు కాబట్టి దోమ తెరలు వాడండి.

పొడవాటి దుస్తులు ధరించడం:

చేతులు పొడుగ్గా ఉండే షాట్లు, ఫుల్ ప్యాంట్లు ధరించడం వల్ల దోమలు కుట్టకుండా ఉంటాయి. కాబట్టి రాత్రి నిద్ర పోయేటప్పుడు కూడా పొడవాటి దుస్తులు ధరించడం మంచిది.

నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి:

ఇంట్లో ఉండే పూలకుండీలు, పాత టైర్లు, సామాన్లలో నీరు నిల్వ ఉండిపోతుంది. ముఖ్యంగా వర్షాకాలం వచ్చింది కనుక వర్షపు నీరు వాటిలో నిల్వ ఉండిపోవడం వల్ల దోమల బెడద ఎక్కువైపోతుంది. కాబట్టి ఇటువంటి వాటి నుండి వెంటనే నీరు తొలగించి శుభ్రంగా ఉంచుకోండి. దీంతో దోమలు లేకుండా ఉండొచ్చు.

స్ప్రే చెయ్యండి:

దోమలు రాకుండా మీ తోటలో స్ప్రే చేయండి. ఇంట్లో మొక్కలు పెంచుకోవడం చాలా మందికి ఇష్టం మొక్కలు కారణంగా కూడా దోమలు ఎక్కువై పోతాయి. దోమలు రాకుండా గార్డెన్లో స్ప్రే జల్లడం వల్ల దోమలు లేకుండా ఉండొచ్చు. కాబట్టి దోమల స్ప్రే వాడండి.

సెంట్ వంటి వాటిని ఉపయోగించద్దు:

మంచి సువాసన వచ్చే సెంట్లు, సబ్బు వంటి వాటిని ఉంచడం వల్ల ఆ దోమలు ఆకర్షణకి గురవుతాయి. కాబట్టి ఇటువంటి వాటిని స్ప్రే చేయకుండా ఉండండి. ఇలా చిన్నచిన్న టిప్స్ ని అనుసరించడం వల్ల ఇంట్లో దోమలు ప్రవేశించకుండా చూడొచ్చు. దీనితో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి వీలవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news