చాలా మంది మైగ్రేన్ తో బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్లు ఆహారం విషయంలో ఈ మార్పులు చేస్తే మంచిది. ఒత్తిడి ఎక్కువగా ఉండటం, నిద్రలేమి సమస్యలు, వాతావరణం మార్పులు, పోషకాహారం వంటివాటి వల్ల మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మైగ్రేన్ సమస్య నుండి బయట పడాలంటే డైట్ లో ఈ మార్పులు చెయ్యండి. వీటిని కనుక మీరు తీసుకుంటే కచ్చితంగా మైగ్రేన్ నుండి బయటపడవచ్చు. మరి ఆలస్యం ఎందుకు ఆ ఆహార పదార్థాల గురించి ఇప్పుడు చూద్దాం.
తాజా పండ్లు:
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు. అయితే మైగ్రేన్ సమస్యతో బాధపడే వాళ్ళు తాజా పండ్లు తీసుకోవడం మంచిది. తాజా పండ్లు తీసుకోవడం వల్ల మైగ్రేన్ సమస్య నుండి బయట పడవచ్చు.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్:
ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం వల్ల కూడా మైగ్రేన్ సమస్య నుండి బయట పడవచ్చు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే ఇన్ఫ్లమేషన్ సమస్య తొలగుతుంది. వాల్ నట్స్, ఫ్లేక్ సీడ్స్, సాల్మన్ వంటి వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.
ఎంఎస్జి తో ఉండే ఆహార పదార్థాలు తీసుకోకండి:
కొన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ లో ఎంఎస్జి ఉంటుంది. ఆ ఫుడ్స్ తినడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ప్యాకేజ్డ్ ఫుడ్స్ కొనేటప్పుడు వాటి మీద ఎంఎస్జి లేకుండా చూసుకోండి.
హైడ్రేట్ గా ఉండండి:
ఆరోగ్యానికి నీళ్లు చాలా ముఖ్యము. డిహైడ్రేషన్ సమస్య రాకుండా మీరు నీళ్ళు ఎక్కువ తీసుకోండి డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి సమస్య వస్తుంది. కాబట్టి రోజుకు కనీసం ఎనిమిది గ్లాసులు నీళ్లు తాగినట్టు చూసుకోండి.
కెఫీన్ ని తగ్గించండి:
కాఫీ, సోడా వంటి వాటిల్లో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వాటికి దూరంగా ఉంటే మైగ్రేన్ సమస్య నుండి కూడా దూరంగా ఉండొచ్చు. కాబట్టి ఆహారం విషయంలో ఈ మార్పులు చేస్తే మైగ్రేన్ సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు. దీంతో మీరు మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు.