ఇవాళ ఏపీ కేబినేట్ సమావేశం… దళితులకు భూ పంపిణీపై కీలక ప్రకటన

-

ఇవాళ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. మంగళవారం జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

ముఖ్యంగా దళితులకు భూ పంపిణీపై కెబినెట్లో చర్చించనున్నారు ఏపీ మంత్రులు. దళితులకు భూ పంపిణీపై కసరత్తు చేశారు అధికారులు. అలాగే, పాఠశాలల్లో టోఫెల్ శిక్షణ కొసం చేసుకున్న ఒప్పందాలను అమోదించనుంది మంత్రివర్గం. 15 వేల డీఎస్సీ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనల పై కెబినెట్లో చర్చ చేయనున్నారు. నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది జగన్ సర్కార్. బేతంచర్ల, గుంతకల్, మైదుకూరు లలో పాలిటెక్నిక్ కళాశాలలు ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది మంత్రి వర్గం. ఎస్సీఆర్టీలో ఖాళీల భర్తీకి అనుమతి ఇవ్వనుంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం.

Read more RELATED
Recommended to you

Latest news