ఈ సమస్యలతో బాధ పడుతున్నారా..? అయితే జీర్ణవ్యవస్థలో సమస్య ఉన్నట్టే..!

-

చాలామంది ఈ రోజుల్లో జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. జీర్ణవ్యవస్థ దెబ్బ తింటే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. మానసిక సమస్యలు మొదలు ఆటో ఇమ్యూన్ డిసార్డర్, హార్మోన్ల సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు ఇలా ఏదైనా రావచ్చు. కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, తరచు కడుపునొప్పి వంటివి వేధిస్తున్నట్లయితే ఇరిటెబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నట్లే అర్థం చేసుకోవాలి. వెంటనే వైద్యులు సంప్రదించడం మంచిది. వాటిలో మార్పులు వచ్చినట్లయితే బరువులో హెచ్చుతగ్గులు ఉంటాయి. కొవ్వులు ఎక్కువగా ఉంటే ఆహారాలతో ఉబకాయానికి కారణమయ్యి పేగుల్లో పేరుకుపోతుంది. చివరికి ఇబ్బందులు వస్తాయి.

జీర్ణ వ్యవస్థలో సమస్యల కారణంగా మానసిక ఇబ్బందులు కూడా వస్తాయి. ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడి వంటివి రావచ్చు. వీటిని కొంతవరకు నయం చేయొచ్చు. నిత్యం అలసటగా ఉండడం కూడా జీర్ణవ్యవస్థలో సమస్యలకు సంకేతం అని అర్థం చేసుకోవాలి. నీరసంతో బాధపడే వాళ్ళు సగం మందికి జీర్ణవ్యవస్థకు సంబంధిత సమస్యలు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. జీర్ణవ్యవస్థ సమస్యలను చక్కదిద్దుకోవడానికి జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. మెడికేషన్, వ్యాయామం జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఆహారం తినే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇలా వీటిని మీరు ఫాలో అయినట్లయితే కచ్చితంగా సమస్య నుంచి బయటపడవచ్చు. ఆహారాన్ని బాగా నమిలి తిన్నట్లయితే జీర్ణ సంబంధిత సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. క్రమం తప్పకుండా ప్రీ ప్రొబయోటిక్స్ తీసుకోవడం వలన కూడా పేగులకు మేలు కలుగుతుంది. చాలామంది జీర్ణ సమస్యలు ఉన్న లైట్ తీసుకుంటారు. అలా ఎప్పుడూ చేయొద్దు. సమస్య నుంచి బయటపడడానికి సమస్య తీవ్రంగా ఉంటే వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news