ఫ్యాటీ లివర్‌ రావడానికి కారణాలు ఇవే…ఆకలి మందగిస్తుందా..?

-

బాడీలో కొవ్వు పేరుకుపోవడం అనేది అనేక అనర్థాలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఊబకాయం.. కొవ్వు శరీరానికే కాదు.. అవయవాలకు కూడా పడుతుంది. అందులో ఒకటి.. ఫ్యాటీ లివర్‌.. పేరులోనే మ్యాటర్‌ ఏంటో అర్ధమైపోతుందిగా.. జనరల్‌గా లివర్‌ అంటే మస్త్‌ యాక్టివ్‌గా ఉండి.. ఎప్పుడెప్పుడు క్లీనింగ్‌ చేద్దామా అన్నట్లు ఉంటుంది. విషపదార్థాలన్నింటిని ఫిల్టర్‌ చేయడమే దీని పని.. ఇక దీనికి ఫ్యాట్‌ చుట్టుముట్టిందంటే… అది ఆ పనులన్నీ మాని.. సప్పుడుచేయకుండా పండుకుంటుంది. అయితే ఇది ఎందుకు వస్తుంది..? ఎవరిలో ఎక్కువగా వస్తుంది.? కారణాలు ఏంటో జర చూద్దాం.!

ఫ్యాటీ లివర్ రెండు రకాలు. ఒకటి ఆల్కహాలిక్, రెండోది నాన్ ఆల్కహాలిక్. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌ను వైద్య పరిభాషలో స్టీటోసిస్ అని కూడా అంటారు. మద్యపానం చెయ్యని వ్యక్తుల్లో ఇది సంభవిస్తుంది. ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటే దీని నుంచి బయటపడొచ్చు.

కాలేయంలో కొవ్వు ఎందుకు చేరుతుంది?

కాలేయంలో కొవ్వు మొత్తం మన లివర్ బరువులో 5% మించి ఉంటే దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. అధిక కేలరీలు ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు కొవ్వు పేరుకుపోతుంది. చక్కెర పానీయాలు, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కేలరీలు ఎక్కువ తీసుకుంటున్నట్టు అవుతుంది. దీని వల్ల అవసరానికి మించి కొవ్వు శరీరంలో పేరుకుపోతుంది. అందుకే కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు మితంగా తీసుకోవాలంటారు..

ప్రమాదం ఎవరికి..?

స్టీటోసిస్ బరువుకి సంబంధించినది. 30 కంటే ఎక్కువ బాడీ మాస్ ఇండెక్స్(BMI) ఉన్న వాళ్ళు దీని వల్ల ప్రమాదంలో పడతారని వైద్యులు అంటున్నారు.. BMI బరువు, ఎత్తుతో సంబంధం కలిగి ఉంటుంది. శరీరం బరువు పెరిగే కొద్ది కాలేయంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టే.

మధుమేహం, మెటబాలిక్ సిండ్రోమ్‌తో బాధపడే వాళ్ళలో కూడా ఈ ఫ్యాటీ లివర్ సమస్య మరింత హాని చేస్తుంది.

ఈ సమస్య ఎక్కువ అయితే మరింత ప్రమాదకరంగా మారుతుంది. కొంతమంది రోగుల్లో కాలేయంలోని కొవ్వు స్టీటోహెపటైటిస్ దారితీస్తుంది. దీని వల్ల కాలేయంలో మచ్చలు ఏర్పడతాయి. ఇలా జరిగిందంటే.. సమస్య ముదిరిందని అర్థం.. ఇది సంకేతం. దీన్నే సిర్రోసిస్ అంటారు.

మచ్చ కణజాలం ఏర్పడిన తర్వాత దానిని తొలగించడం లేదా చికిత్స చేయడం సాధ్యం కాదు. అందుకే వ్యాధి ముదరక ముందే గ్రహించి వెంటనే చికిత్స తీసుకోవాలి. అప్పుడే ప్రమాదం నుంచి బయటపడతారు.

కొవ్వు ఎలా తగ్గించుకోవాలి?

కాలేయంలో కొవ్వు తగ్గించుకోవడానికి ఉత్తమ మార్గం బరువు తగ్గడం. ఆహారంలో మార్పులు చేసుకుంటూ డైట్ ఫాలో అవుతూ శరీరానికి తగినంత శారీరక శ్రమ ఇవ్వడం వల్ల దీని నుంచి బయట పడొచ్చు. BMI 35 కంటే ఎక్కువ ఉంటే మాత్రం శస్త్రచికిత్స ద్వారా మాత్రమే కొవ్వుని తీసేయగలరు.

మధుమేహం ఉంటే ఇది మరింత ప్రమాదకరం. ఆల్కాహాల్ అలవాటు ఉంటే వెంటనే నివారించడం మంచిది. బరువు తగ్గడం వల్ల కొవ్వు కరిగి ఎటువంటి సమస్యలు లేకుండా ఎక్కువ కాలం జీవించవచ్చు.

ఫ్యాటీ లివర్ గుర్తించే లక్షణాలు..

ఫ్యాటీ లివర్‌తో బాధపడే వాళ్ళలో స్పష్టమైన లక్షణాలు కనిపించవు. అయితే..ఈ వ్యాధి ముదరకుండా మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం అసలు నిర్లక్ష్యం చెయ్యకూడదు.

వికారం

కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారడం.

బొడ్డు వాపు రావడం జరుగుతుంది.

కాలేయం మీద కుడి ఎగువ భాగంలో నొప్పి

ఆకలి లేకపోవడం 

Read more RELATED
Recommended to you

Latest news