ఆంధ్రప్రదేశ్లోని ముస్లిం యువతులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పేద ముస్లిం యువతులకు పెళ్ళికానుక అందించే దుల్హన్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటన చేసింది ఏపీ ప్రభుత్వం. దుల్హన్ పథకాన్ని అమలు పై ఏపీ హైకోర్టులో నిన్న విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దుల్హన్ పథకాన్ని అమలు చేయడం లేదంటూ హైకోర్టులో మైనార్టీ పరిరక్షణ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ సందర్భంగా ప్రభుత్వం పథకానికి సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలను ఏపీ హైకోర్టు గుర్తు చేసింది. దుల్హన్ పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదంటూ గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల ఒకటో తేదీ నుంచి దుర్గం పథకాన్ని అమలు చేయబోతున్నట్లు హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ వివరించారు. ఈ మేరకు జీవో నెంబర్ 39ని ఏపీ హైకోర్టుకు సమర్పించారు. దీంతో అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఈ పథకం అమలు కానుంది. ఈ పథకం అమలు నేపథ్యంలో ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.