జుట్టు, చర్మం.. సంరక్షణకి కావాల్సిన విటమిన్ ఈ అధికంగా గల ఆహారాలు..

-

చలికాలం కారణంగా చర్మం, జుట్టు సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వాతావరణంలోని మార్పులు చర్మం పొడిబారిపోవడానికి, జుట్టు గడ్డిలా మారడానికి కారామవుతాయి. ఐతే దీన్ని నివారించడానికి మార్కెట్లో చాలా రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. ఆ వస్తువులన్నింటిలో విటమిన్ ఈ ఉంటుంది. చలికాలంలో జుట్టు, చర్మ సంరక్షణకి విటమిన్ ఈ చాలా అవసరం.

మార్కెట్లో దొరికే వస్తువుల్లో ఉండే విటమిన్ ఈ, వేరే రకాల రసాయనాలతో కలిసి ఉంటుంది. కాబట్టి పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. అలా కాకుండా మనం తీసుకునే ఆహారాల్లో ఎక్కువ విటమిన్ ఈ ఉండేలా చూసుకుంటే మంచిది. విటమిన్ ఈ ఎక్కువగా ఉమ్డే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బాదం

రాత్రి నానబెట్టిన బాదంని పొద్దున్న లేవగానే టీతో పాటు తీసుకోవడం గానీ, లేదా ఉదయం పూట తీసుకున్నా శరీరానికి కావాల్సిన విటమిన్ ఈ అందుతుంది. ఐతే నానబెట్టిన తర్వాత వాటి పై పొరన్ని తీసివేయడం మర్చిపోవద్దు. అంతేకాదు. రోజులో ఐదు బాదం మాత్రమే తినాలి. అతిగా తినకూడదు.

సూర్యపువ్వు గింజలు

కొద్దిగా వేయించిన సూర్యపువ్వు గింజలని పొద్దున్నపూట టీ తాగేటప్పుడు తీసుకుంటే బాగుంటుంది. అలా కాకున్నా, కేకుల్లో గానీ, ఓట్స్ తీసుకునేటపుడు గానీ తీసుకుంటే శరీరానికి మంచిది.

పల్లీలు

పీనట్ బటర్ లో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. ఉప్మా లేదా ఇతర భోజనం చేసేటపుడు ఈ బటర్ ని అదనంగా తీసుకుంటే ఉత్తమం.

అవోకోడో

ఈ మధ్యకాలంలో బ్రేక్ ఫాస్ట్ సెన్సేషన్ గా మారింది ఏదైనా ఉందంటే అది అవోకోడో మాత్రమే. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి కావాల్సిన విటమిన్ ఈ ని అందిస్తాయి. దానివల్ల చర్మం, జుట్టుకి కావాల్సిన పోషకాలు అంది ఆరోగ్యంగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news