ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. ఆరోగ్యంగా ఉండడం కోసం అనేక రకాల చిట్కాలని పాటిస్తారు. కొందరైతే ఎక్కువగా కాలం బతకాలని మంచి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకుంటూ ఉంటారు. మీరు కూడా ఎక్కువకాలం బతకాలని అనుకుంటారా ఎక్కువకాలం జీవించిన వాళ్ళ అలవాట్లు ఇవి. వీటిని పాటిస్తే ఖచ్చితంగా మీరు కూడా ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండొచ్చు.
ప్రతి ఒక్కరు కూడా ఎక్కువకాలం బతకాలని అనుకుంటారు దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. మీరు కూడా ఎక్కువ కాలం ఎందుకు జీవించాలి అనుకుంటున్నారో తెలుసుకోండి. ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని ప్రతి రోజు తీసుకుంటూ ఉండండి. అల్పాహారాన్ని అసలు తీసుకోకుండా మానేయకండి. ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారాన్ని ఉదయాన్నే తీసుకోవడం వలన ఎక్కువ కాలం జీవించడానికి అవుతుంది మీ జీవితంలో మీరు ఈదడానికి ఒక కప్పు కాఫీ బాగా ఉపయోగపడుతుంది.
చాలామంది ఒక కప్పు కాఫీ ని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటారు ఎక్కువ పంచదార వేసుకోకుండా ఒక కప్పు కాఫీని తాగుతూ ఎంజాయ్ చేయండి. ఉదయం మీరు లేవగానే మొట్టమొదట ఎవరినైతే చూస్తారో వాళ్ళతో మంచి మాటలు చెప్పండి ఇలా మీ ఆనందాన్ని పంచుతూ రోజుని మొదలు పెట్టండి. హార్వర్డ్ స్టడీ ప్రకారం ఉదయాన్నే ఈ విధంగా పాటించడం వలన మీరు ఎంతో సంతోషంగా ఉండగలరు. అలానే ఎక్కువకాలం జీవించడానికి ఇది సహాయపడుతుంది ఎక్కువ కాలం జీవించాలంటే మంచి నిద్ర, నీళ్లు తీసుకోవడం ఇవన్నీ కూడా చాలా ముఖ్యం యోగ వ్యాయామం మెడిటేషన్ కోసం కూడా సమయాన్ని వెచ్చించండి.