బ్రౌన్ షుగర్ తో ఈ ఐదు చర్మ సమస్యలను దూరం చేసేయొచ్చు.! 

-

ఈ రోజుల్లో అందంగా ఉండటానికి ప్రతి అమ్మాయి తాపత్రయ పడుతుంది. అందుకోసమే ఏవేవో క్రీమ్స్, మరెన్నో చిట్కాలు. అందులో ఒకటి బ్రౌన్ షుగర్.. షుగర్ ఆరోగ్యానికి మంచిది కాదు కానీ..అందానికి మాత్రం సూపర్ గా పనికొస్తుంది. చర్మాన్ని మెరిసెలా చేయడంతో పాటు.. ఐదు రకాల సమస్యలను బౌండరీ దాటించేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఆ సమస్యలు ఏంటి..ఎలా వాడాలో చూద్దామా..!
మచ్చలు తొలగిస్తుంది: బ్రౌన్ షుగర్ లో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు చర్మం పైనున్న హానికరమైన టాక్సిన్స్ ను తొలగిస్తాయి. దీంతోపాటు చర్మం నిగారింపు కూడా పెరుగుతుంది. దీని కోసం.. కొబ్బరి నూనెలో కొంచెం బ్రౌన్ షుగర్ వేసి రెండు కలిపి ముఖంపై స్క్రబ్ చేయాండి. కాసేపటి క్లీన్ చేసుకుంటే చాలు.
యాంటీ ఏజింగ్ లక్షణాలు: బ్రౌన్ షుగర్ ప్రత్యేకత ఏమిటంటే ఇది ముఖంపై అకాల ముడతలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. యాంటీ ఏజింగ్ ఏజెంట్ అని కూడా అంటారు. ఈ సమస్యను అధిగమించడానికి బ్రౌన్ షుగర్‌లో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి, ఈ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేసి స్క్రబ్ చేసుకోండి.
డెడ్ స్క్రిన్ తొలగించడానికి : ముఖంపై రంధ్రాలు, ఎర్రటి ఛారలు కారణంగా ఫేస్ లుక్ మారిపోతుంది. గ్లో ఉండదు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు బ్రౌన్ షుగర్లో తేనెను కలిపి… దాంతో మసాజ్ చేయడం వల్ల రంద్రాలు క్లియర్ అయ్యి ముఖం కూడా మెరిసిపోతుంది.
స్కిన్ టానింగ్: ఎండవల్ల, బయట కాలుష్యం వల్ల స్కిన్ ఊరికే టాన్ అయిపోతుంది. ఈ క్రమంలో చర్మంపై ఉన్న టాన్ తొలగించడం పెద్ద సమస్యగా మారుతుంది. ఇందుకోసం బ్రౌన్ షుగర్ తీసుకుని అందులో నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
స్కిన్ బ్లడ్ సర్క్యులేషన్: చర్మంపై రక్త ప్రసరణ సరిగ్గా లేకుంటే.. దీని ప్రభావం జుట్టు, చర్మం రెండింటిపై ప్రభావం చూపుతుంది. చర్మ రక్త ప్రసరణను మెరుగుపరచడానికి బ్రౌన్ షుగర్, తేనె మిశ్రామాన్ని ముఖంపై స్క్రబ్ చేసుకోవాలి.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news