తూర్పులో త్రిముఖం..ఆ రెండు కలిస్తే వార్ వన్‌సైడ్.!

-

వార్ వన్‌సైడ్: ఏపీలో ఈ సారి ఎన్నికల పోరు హోరాహోరీగా జరగనుంది..గత ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్లు వైసీపీ గెలిచేసిన విషయం తెలిసిందే. కానీ ఈ సారి వైసీపీ గెలవడం కష్టమే..వైసీపీకి టి‌డి‌పి గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో జనసేన ప్రభావం ఉండనుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అతి పెద్ద జిల్లాగా ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరిలో త్రిముఖ పోరు జరగనుంది. తూర్పులో అత్యధికంగా 19 సీట్లు ఉన్న విషయం తెలిసిందే.

ఇక్కడ మెజారిటీ సీట్లు గెలుచుకున్న పార్టీ..రాష్ట్రంలో గెలవడం పక్కా అనే సెంటిమెంట్ ఉంది. 2014లో ఇక్కడ టి‌డి‌పికి మెజారిటీ వచ్చింది. 2019 ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. 19 సీట్లలో వైసీపీ 14, టీడీపీ 4, జనసేన 1 సీటు గెలుచుకుంది. అయితే వైసీపీ అలా 14 సీట్లు గెలవడానికి కారణం జనసేన ఓట్లు చీల్చడం..ఓట్లు చీలడం వల్ల టి‌డి‌పికి నష్టం, వైసీపీకి లాభం జరిగింది. ఇక ఇప్పుడు వైసీపీపై వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. ఆయా స్థానాల్లో టి‌డి‌పి గెలుపుకు అవకాశాలు ఉన్నాయి.

వార్ వన్‌సైడ్
వార్ వన్‌సైడ్

అయితే మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు జరగనుంది. ఎందుకంటే ఇప్పుడు జనసేన కూడా బలపడింది. ఇలా మూడు పార్టీల మధ్య పోరు జరిగే ఛాన్స్ ఉంది. అదే సమయంలో టి‌డి‌పి-జనసేన గాని పొత్తు పెట్టుకుంటే వార్ వన్ సైడ్ అవుతుంది. జిల్లాలో 19 సీట్లు ఉంటే..టి‌డి‌పి-జనసేన కాంబినేషన్ లో 14 సీట్లు సులువుగా గెలిచే ఛాన్స్ ఉంది.

ఇక వైసీపీకి 5 సీట్లు వరకు దక్కవచ్చు. ఇక ప్రజా గాలి మారిందంటే వైసీపీకి 5 సీట్లు కూడా దక్కడం కష్టమనే పరిస్తితి. అంటే టి‌డి‌పి-జనసేన కలిస్తే తూర్పులో వైసీపీకి చెక్ పడిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news