బ్రజల్ లెస్ స్ప్రౌట్స్ లోని ఉన్న ఈ అద్భతమైన పోషకాలు.. ఈ జబ్బుకు బాగా పనిచేస్తాయట..!

-

బ్రజల్ లెస్ స్ర్పౌట్స్ గురించి ఈ మధ్య కొందరిలో అవగాహన పెరిగింది. పల్లెటూర్లలో ఇవి ఎక్కువగా దొరకవు కానీ… అదే సిటీల్లో అయితే..డో ర్ డెలివరీ కూడా చేస్తారు. కేజీ 170 వరకూ ఉండే ఈ స్ప్రౌట్స్ తింటే ఆరోగ్యానికి ఎలా మంచిది, ఎలా తినాలో ఈరోజు చూద్దాం.

100గ్రాముల బ్రజల్ లెస్ స్ప్రౌట్స్ తీసుకుంటే..ఉండే పోషకాల విలువలు

పిండిపదార్థాలు 9 గ్రాములు
ప్రొటీన్3.4 గ్రాములు
ఫ్యాట్ 3.8 గ్రాములు
కాలరీలు 43
విటమిన్ C 85 మిల్లీ గ్రాములు
విటమిన్ K 177 మైక్రో గ్రాములు

ఈ బ్రజల్ లెస్ స్ప్రౌట్స్ లో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయని సైంటిఫిక్ గా నిరూపించబడింది. ఫ్రీ రాడికల్స్ ను నిర్మూలించి శరీర కణజాలం రక్షించిస్తాయట. వారంలోనే ఇవి ఫ్రీరాడికల్ డామేజన్ ను ఎదుర్కొంటాయి. ఇందులో ఉండే కాఫిరాల్ అనే యాంటి ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటుంది. రోజుకు 150 గ్రాముల వీటిని వాడినప్పుడు..శరీరంలో 28-30శాతం ప్రీ రాడికల్ డామేజ్ ను వారంలోనే తగ్గించాయని పరిశోధనలో తేలింది.

దీనివల్ల రెండో బెనిఫిట్ ఏంటంటే..లైపోయిక్ యాసిడ్ అనే కెమికల్ కాంపోండ్ ఈ బ్రజల్ స్ప్రౌట్స్ ఉంటుంది. ఇది డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుందట. ఎలా అంటే..డయబెటీస్ పెరగడానికి కారణం అయ్యే..NFKB అనే ఇన్ఫ్లమెటరీ మీడియాటర్ ను నివారించడానికి ఈ లైపోయిక్ యాసిడ్ ఉపయోగపడుుతుందట. నరలా మంటల కూడా ఉంటాయి డయాబెటీస్ పేషెంట్స్ కి..ఆ మంటలకు తగ్గించడానికి కూడా ఈ బ్రెజల్ లెస్ స్ప్రౌట్స్ ఉపయోగపడతాయని సైంటిఫిక్ గా నిరూపించారు.

మూడవ లాభం తీసుకుంటే..సాలిబల్ ఫైబర్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రేగుల్లో ఉండే..ఉపయోగపడే సూక్ష్మజీవులను పెంచడానికి అద్భుతంగా పనిచేస్తుందట. హెల్ప్ ఫుల్ బాక్టిరీయా బాగా పెరిగితే..డయాబెటీస్ లాంటివి రాకుండా చేయడానికి రక్షణ వ్యవస్థ బాగా చురుగ్గా పనిచేయడానికి, అనేక పోషకాలు బాగా అందటానికి, డైజెషన్ బాగా జరగటానికి బాగా ఉపయోగపడుతుంది.

చూడ్డానికి..చిన్న క్యాబేజీలా ఉండే..ఈ బ్రెజల్ లెస్ స్ప్రౌట్స్ ని సలాడ్స్ లో వాడుకోవచ్చు. కొద్దిగా స్టీమింగ్ తీసేసి..వాడుకోవచ్చు. ఫ్రష్ గా కట్ చేసి స్ప్రౌట్స్ లో వాడుకోవచ్చు. ఎక్కువగా హీట్ చేయకుండా..ఆప్ బాయిల్ చేసి వాడుకోవడం మంచిది. సూప్స్ లో వేసుకోవచ్చు. బాగా ఉడికించి, వేపించి చేయకూడదు. ఇవి అందుబాటులో ఉంటే..తప్పనిసరిగా ట్రై చేయండి.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news