మీ బ్లడ్ గ్రూప్ ఓ నెగెటివా ? అయితే మీకు శుభవార్తే. ఎందుకంటే ఈ గ్రూప్ రక్తం ఉన్నవారికి కోవిడ్ తీవ్రతరం అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని సైంటిస్టులు గుర్తించారు. ఈ మేరకు కొందరు సైంటిస్టులు ఓ అధ్యయనాన్ని చేపట్టారు. సదరు వివరాలను అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అనే జర్నల్‌లోనూ ప్రచురించారు.
కరోనా నేపథ్యంలో మొత్తం 2,25,556 మంది కోవిడ్ పేషెంట్లకు చెందిన వివరాలను సైంటిస్టులు సేకరించారు. వారి బ్లడ్ గ్రూపులు ఏమిటి, వారిలో కోవిడ్ లక్షణాలు, తీవ్రత ఎలా ఉన్నాయి అని తెలుసుకున్నారు. దీంతో వారికి తెలిసిందేమిటంటే.. 1328 మందికి కోవిడ్ తీవ్రతరమైనట్లు గుర్తించారు. వారి బ్లడ్ గ్రూప్‌లు ఎబి, బి గా గుర్తించారు.
ఇక ఒ నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి కోవిడ్ తీవ్రత, లక్షణాలు తక్కువగా ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. వారికి ప్రాణాపాయ స్థితి రాలేదని నిర్దారించారు. కానీ ఎబి, ఎ, బి గ్రూప్‌లకు చెందిన వారికి కోవిడ్ తీవ్రత, లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుసుకున్నారు. అయితే కేవలం ఒ నెగెటివ్ ఉన్నవారికే ఇలా ఎందుకు జరుగుతుంది, అందుకు గల కారణాలు ఏమిటి ? అనే వివరాలను వారు ప్రస్తుతం తెలుసుకునే పనిలో ఉన్నారు.