ఎగ్జామ్స్ టైంలో ఈ ఫుడ్ బెస్ట్…!

-

ఈ రోజుల్లో చదువు వలన పిల్లలు సరిగా తినడం లేదు అనేది వాస్తవం. తల్లి తండ్రులు మార్కుల కోసం పిల్లలను వేధించడంతో పిల్లలు అనారోగ్యానికి కూడా గురవుతున్నారు. మార్కులు పరువుగా భావించి వాళ్లకు చుక్కలు చూపిస్తున్నారు. అయితే పది నుంచి 18 ఏళ్ళ లోపు మగ పిల్లల్లో జీవ క్రియ అనేది చాలా వేగంగా ఉంటుంది. సరిగా తినకపోతే బరువు పెరగడం, తగ్గడం, నీరసం, విటమిన్ల లోపం వంటి సమస్యలు వస్తాయి.

వీరికి ప్రోటీన్ ఆహారం అనేది చాలా అవసరం. వీరికి ప్రతీ రోజు సరైన ఆహారం అనేది అవసరం. రోజూ గుడ్లు, పాలు, పెరుగు, అన్ని రకాల పప్పులు ఇస్తే వారి ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు వైద్యులు. మాంసాహారం తినేవారైతే చికెన్‌, చేప, మటన్‌లను నూనె తక్కువ వేసి వండి పెడితే మంచిది. కాల్షియం, ఇనుము కూడా చాలా అవసరం. విటమిన్లు, ఖనిజాల కోసం తాజా పండ్లు, అన్ని కాయగూరలు, ఆకుకూరలు ఉండాల్సిందే.

అన్నం, రొట్టెల కంటే కూర, పప్పు ఎక్కువగా తినాల్సి ఉంటుంది. చాక్‌లెట్లు, బిస్కెట్లు, చిప్స్‌, శీతలపానీయాలకు బదులు పండ్లు, మొలకెత్తిన గింజలు, బఠాణీలు, సెనగలు, మరమరాలు, పేలాలు, ఇంట్లో చేసిన రొట్టెలను స్నాక్స్‌గా ఇస్తే చాలా ఉపయోగం ఉంటుంది. బాదం, ఆక్రోట్‌లలోని ఆవశ్యక ఫ్యాటీ యాసిడ్లు మెదడు చురుగ్గా ఉండడానికి సహకరిస్తాయి. కాబట్టి పరిక్షల సమయంలో ఈ ఆహారం తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news