ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండడానికి చూస్తూ ఉంటారు. ఈ రోజుల్లో గుండె సంబంధిత సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. రాబోయే 30 ఏళ్లలో మీ గుండె ఆరోగ్యం ఎలా ఉండబోతోంది అనేది ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ చెప్పేస్తోంది. రీసెర్చ్ ప్రకారం కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్, ఇతర బయో మార్కర్స్ ద్వారా కార్డియో వాస్కులర్ హెల్త్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. గుండెకి ఎలాంటి రిస్క్ కలగబోతుందని చిన్న బ్లడ్ టెస్ట్ చెప్తోంది.
ఈ బ్లడ్ టెస్ట్ ఎల్డిఎల్ లేదా చెడు కొలెస్ట్రాల్ పై ఫోకస్ చేస్తుంది. ఇతర బయో మార్కర్స్, బయోలాజికల్ సమస్యలు, ఇతర సమస్యలను తెలుపుతాయి. LDL కొలెస్ట్రాల్ తో పాటుగా లిపో ప్రోటీన్ గురించి కూడా టెస్ట్ లో తెలుస్తుంది. హార్ట్ ఎటాక్, స్ట్రోక్, కరోనరీ హార్ట్ డిసీజ్ వంటి వాటిని తెలుపుతుంది. సైంటిస్టులు 30 వేల మంది మహిళలతో ఎనలైజ్ చేశారు యావరేజ్ గా 55 ఏళ్ల మహిళలు ఉన్నారు. 13 శాతం లేదా 3600 మహిళలకు హార్ట్ ఎటాక్ లేదా స్ట్రోక్ సర్జరీ చేయాల్సి వస్తుందని లేదంటే గుండె సమస్యలతో రాబోతున్న 30 ఏళ్లలో ఇబ్బంది పడాలని నిపుణులు తెలిపారు.
ఈ మహిళల్లో LDL కొలెస్ట్రాల్ ఇటువంటివన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. వాటిని ఆధారంగా గుండె సమస్యలతో రానున్న 30 ఏళ్లలో మహిళలు ఇబ్బంది పడతారని నిపుణులు చెప్పారు. చాలామంది ఈ రోజుల్లో గుండె సమస్యలతో బాధపడుతున్నారు. గుండె ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. లేదంటే అనవసరంగా గుండె సమస్యలు బారిన పడాల్సి ఉంటుంది.