కరోనా వైరస్ ఇప్పుడు దేశాన్ని ఎంతగానో భయపెడుతుంది. చాలా వరకు కరోనా ప్రభావం మన దేశంలో ఉంది. అన్ని రాష్ట్రాలు కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇది ఎప్పుడు అదుపులోకి వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే కరోనా రాకుండా ఉండాలి అంటే ప్రజలే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే కచ్చితంగా కరోనా వచ్చే అవకాశాలు ఉండవు అంటున్నారు.
1. ఇంటిలో నుండి బయటికి వెళ్లవద్దు, ఒక వేళ వెళితే ఫుల్ హాండ్స్ షర్ట్స్ వేసుకోవాలి.
2. ఆడవాళ్ళు జుట్టు ఫ్రీ గా వదిలేయకుండా ముడి వేసుకోవాలి.
౩. వాచ్ లు, ఉంగరాలు, గొలుసులు వంటివి వేసుకోవద్దు.
4. ఆడవారు మేకప్ జోలికి వెళ్లవద్దు.
5. అపరిచితులకు దూరంగా ఉండండి.
6. వీలున్నంతవరకు కరెన్సీ నోట్లు వాడకండి.
7. పబ్లిక్ ట్రాన్సు పోర్ట్ వాడవద్దు. పర్సనల్ వెహికల్స్ వాడుకోవచ్చు.
8. బయటికి వెళ్ళినపుడు అయిదుగురు కంటే ఎక్కువ ఉన్న గుంపు దగ్గరకు వెళ్లవద్దు.
9. మాస్కులు కట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒక వేళ కట్టుకుంటే మడతలు పైకి కనపడేలా కట్టుకోవాలి.
10. దగ్గు వస్తే అరచేయి కాకుండా మోచేతిని అడ్డు పెట్టుకోవాలి. లేదా టిష్యు వాడి తరువాత ఉండ చుట్టి డస్ట్ బిన్ లో వెయ్యాలి. శానిటైజర్స్ దగ్గర ఉంచుకోవాలి.
11. రెండు గంటలకి ఒకసారి హ్యాండ్ వాష్ చెయ్యాలి. చేతులు కడుక్కోకుండా ముఖం టచ్ చేయొద్దు.
12. బయటి నుండి వచ్చిన తరువాత డెటాల్ నీటితో చేతులు కడుక్కోవాలి. తరువాత టిష్యు తో తుడుచుకుని దాన్ని పడేయాలి. టవల్ ని ఒక సారి కంటే ఎక్కువ సార్లు వాడకూడదు.
13. ఫోన్, కళ్ళద్దాలు వంటివాటిని వైట్ వైవ్ లుతో తుడుచుకోవాలి.
14. బయటికి వెళ్ళినపుడు లెఫ్ట్ హాండ్ మాత్రమే వాడాలి.
15. పెద్ద వాళ్ళని వేరే గదిలో ఉంచి వారితో దూరం నుంచే మాట్లాడాలి.
16. చంటి పిల్లలను వేరే వాళ్లకి ఇవ్వవద్దు. మీరే చూసుకోండి.
ఇవన్ని పాటిస్తే అంటూ వ్యాధులు రాకుండా చేయొచ్చు.