వేసవిలో ఇబ్బంది పెట్టే చెమటకాయను తగ్గించే ఇంటిచిట్కాలు..

-

వేసవిలో చర్మం అనేక సమస్యలకి గురవుతుంది. దానిలో మొదటిది చెమటకాయ. చర్మంపై చిన్న చిన్న కురుపులు ఏర్పడి, ఎర్రగా మారి దురద పుడుతూ చెరాకు తెప్పిస్తుంటుంది. చిన్నపిల్లల్లో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం వారిని ఎల్లప్పుడూ డైపర్స్ లో ఉంచడం కూడా ఓ కారణం. అదీగాక స్వేద గ్రంధులు పూర్తిగా అభివృద్ధి చెందవు కాబట్టి వారిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ముఖం, మెడ, నుదురు, వీపు భాగాల్లో ఇది ఎక్కువగా కనబడుతుంది. దీన్ని తగ్గించుకోవడానికి మార్కెట్లో రకరకాల పౌడర్లు అందుబాటులో ఉంటాయి. అవే కాకుండా ఇంట్లో ఉండి కొన్ని చిట్కాలని పాటిస్తే ఈ చెమటకాయ నుండి బయటపడవచ్చు.

గాలికి తిరగాలి

ఆశ్చర్య పోతున్నారా? అవును, ఎండాకాలంలో గాలికి ఉండడం చాలా మంచిది. గాలి తగిలితే చెమటకాయలు అవకుండా ఉంటుంది. అందుకే మొత్తం బిగుతుగా ఉండే దుస్తులు ధరించకూడదు. పూర్తిగా కప్పేసే దుస్తుల వల్ల చెమటకాయలు తొందరగా అభివృద్ధి చెందుతాయి. ఎల్లప్పుడూ గాలి తగిలేలా ఉంటే బాగుంటుంది. కాటన్ బట్టలే వాడడం ఉత్తమం.

వేసవి పానీయాలు తాగాలి

వేసవిలో శరీరంలో నుండి నీళ్ళు త్వరగా అయిపోతాయి కాబట్టి ఎప్పటి కప్పుడు దాన్ని బ్యాలన్స్ చేస్తూ ఉండాలి. దానికోసం కొబ్బరి నీళ్ళు, ఇంకా ఇతర ఆరోగ్యకరమైన పానీయాలు తాగడం మంచిది. పుచ్చకాయ తింటే బాగుంటుంది. అందులో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చర్మ సమస్యలు రాకుండా ఉంటుంది.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి

మీ శరీరానికి వేడి చేస్తాయని తెలిసే ఆహారాలని ముట్టుకోకపోవడమే మంచిది. శరీరాన్ని చల్లబరిచే ఆహారాలను సలాడ్స్ వంటివి తీసుకోండి.

చర్మాన్ని తడిగా ఉంచుకోవద్దు

స్నానం చేసి వచ్చాక వెంటనే శుభ్రంగా తుడుచుకుని పొడిగా తయారు చేసుకోవాలి. తడిగా ఉంటే బాక్టీరియా పెరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు పొడిగా ఉంచుకునే ప్రయత్నం చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news