పాతవే అయినా ఇప్పటికీ పనికొచ్చే అద్భుతమైన ఇంటిచిట్కాలు..

-

మారుతున్న టెక్నాలజీ పాత వాటిని దూరం చేస్తుంది. ఎప్పటికప్పుడు అప్ టు డేట్ ఉంటేనే ఈ కాలంలో నెగ్గుకు రాగలుగుతాం అని ప్రపంచాన్ని శాసిస్తుంది. అలా అప్డేట్ అయ్యే క్రమంలో ఎంతో శ్రమని, ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కానీ ఒక విషయం తెలుసా? ఎంత టెక్నాలజీ మారుతున్నా, ఎన్ని కొత్త వస్తువులు కనుక్కుంటున్నా, కొన్ని పాత వస్తువులు, పాత పద్దతులే ఇప్పటికీ సత్ఫలితాలను ఇస్తున్నాయి. అలాంటి కొన్ని పాత పద్దతులని తెలుసుకుందాం.

పాతవే అయినా ఇప్పటికీ అద్భుతంగా పనికొచ్చే ఇంటి చిట్కాలు..

లావెండర్

లావెండర్ వాసనని పీల్చడం ద్వారా నిద్ర తొందరగా వస్తుంది. ఇది గుండె కొట్టుకునే వేగాన్ని నియంత్రించడమే కాకుమ్డా రక్తప్రసరణ వేగాన్ని తగ్గిస్తుంది. దానివల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. అందుకే నిద్ర తొందరగా వస్తుంది.

ఉప్పు

మన ఇళ్ళలో ఉండే ఉప్పు ద్వారా గొంతు మంటను తగ్గించుకోవచ్చు. గొంతు మంట ఇబ్బంది పెడుతుంతే కొన్ని నీళ్ళలో ఉప్పు కలుపుకుని నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మివేస్తే సరిపోతుంది. ఇలా తరచుగా చేస్తుండడం వల్ల గొంతుమంట పూర్తిగా తగ్గుతుంది. ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని తీసుకుని 8ఔన్సుల నీళ్ళలో కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

కలబంద

చర్మం కాలిపోయి మంటగా ఉండి ఇబ్బందిగా అనిపించినపుడు కలబంద బాగా పనిచేస్తుంది. ఇందులో యాంటీఇన్ఫ్ల మేటరీ ధర్మాలు కాలిన చర్మాన్ని సేదతీరుస్తాయి. దానివల్ల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. కలబంద వల్ల చర్మానికి ఇంకా చాలా రకాల ఉపయోగాలున్నాయి.

ఐతే ఇవన్నీ మన తాతముత్తాతలు కూడా ఆచరించారు. అలా అని పద్దతులు పాతవైపోయాయని బాధపడాల్సిన అవసరం లేదు. మనకి పనికొచ్చేది పాతదైనా పెద్ద ప్రాబ్లమ్ ఏం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news