కొంత మందికి ఎవడు సలహాలు ఇస్తాడో తెలియదు గాని… బ్రష్ నిండా పేస్టు ఉండాలి… అలా అయితేనే పళ్ళు శుభ్రంగా ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఏది చెప్పినా నమ్మే జనం అది కూడా అలాగే నమ్మి పేస్టూ ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. దీని వలన వచ్చే సమస్యలను కూడా కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయరు. నోరు శుభ్రంగా ఉండాలని మంచి వాసన రావాలని పేస్టూ ఎక్కువగా వాడుతూ ఉంటారు.
అయితే ఇది అంత మంచిది కాదని అంటున్నారు వైద్యులు. పేస్టూ బ్రష్ నిండా ఉంటే లేనిపోని రోగాలు వస్తాయని అంటున్నారు. పేస్టూ అవసరమే గాని అతి అవసరం లేదని అంటున్నారు. వాస్తవానికి రోజుకి ఓ బఠాణి గింజంత పరిమాణంలో మాత్రమే పేస్టుని ఉపయోగించాలి. దాన్ని కూడా శుభ్రంగా బ్రష్‌తో రాయాలి. ఇలా చేయడం వల్ల పళ్లు బాగా శుభ్రం అవుతాయి. ఎలాంటి సమస్యలు ఎదురుకావు.
కాని ఎక్కువగా తారు పూసినట్టు పూస్తే సమస్యలు కచ్చితంగా రావడమే కాకుండా పళ్ళపై ఉండే ఎనామిల్ అరిగిపోతుంది అంటున్నారు. టూత్ పేస్టు గుణాలు గుణాలు పళ్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. దీనితో అనేక రకాల సమస్యలు వస్తాయి. క్యాన్సర్ కి కూడా కారకం అవుతాయని అంటున్నారు. కాబట్టి ఎవడో చెప్పింది వినకుండా, ఎవడో చెప్పింది నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.