ఇవాళ్టి నుంచే తెలంగాణ ఇంటర్‌ పరీక్షలు..వారి కోసం ప్రత్యేకంగా సెంటర్లు !

-

ఇవాళ్టి నుంచి తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టి నుంచి ప్రారంభం అయ్యే ఈ పరీక్షలు నవంబర్ 3 వరకు కొనసాగుతాయి. ప్రతి రోజూ ఉదయం 9 నుండి 12 గంటల వరకు పరీక్ష ఉండనుంది. పరీక్ష ప్రారంభం అయ్యాక ఒక్క నిమిషం లేట్ అయిన వారిని పరీక్షకు అనుమతించబోరు. హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా రెండు పరిక్షలను రి షెడ్యూల్ చేసింది ఇంటర్‌ బోర్డు. దీని ప్రకారం.. ఆదివారం రోజున కూడా పరీక్ష జరుగనుంది.

70 శాతం సిలబస్ నుండి ప్రశ్నలు… ప్రశ్నల్లో 50 శాతం పైగా ఛాయిస్ ఉండనుండగా… 4 లక్షల 59 వేలు 237 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. ఇక ఈ పరీక్షల కోసం ఏకంగా 17 వందల 68 పరీక్ష సెంటర్ లు ఏర్పాటు చేసింది బోర్డు. పరీక్షల నిర్వహణకు వాక్సిన్ తీసుకున్న వారినే నియామకం చేసిన బోర్డు.. 25 వేల మంది ఇన్విజిలేటర్స్ నియామకం చేసింది. విద్యార్థులు ఒత్తిడికి, భయానికి లోను అయితే సంప్రదించడానికి మానసిక నిపుణులను ఏర్పాటు చేసింది. విద్యార్థులు తెచ్చుకునే వాటర్ బాటిల్స్ కి అనుమతి ఇచ్చిన బోర్డు… మాస్క్ ధరించి రావాలని రూల్‌ పెట్టింది.  థర్మల్ స్క్రీనింగ్ ఉంటుంది…. ఎవరికైనా జ్వరం లక్షణాలు ఉంటే ప్రత్యేక రూమ్ లో పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్స్ సరిపోతుందని.. ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని పేర్కొంది ఇంటర్‌ బోర్డు.

Read more RELATED
Recommended to you

Latest news