మూత్రాన్ని ఆపుకోలేని మహిళల్లో మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉండదు: స్టడీ

-

తాజాగా చేసిన స్టడీ ప్రకారం మూత్రాన్ని కంట్రోల్ చేసుకోలేని మహిళల్లో (Urinary incontinence) ఎక్కువ డిప్రెషన్ ఉంటుందని రీసెర్చర్లు గుర్తించారు. యూరోపియన్ అసోసియేషన్ ఆఫ్ యూరాలజీ కాంగ్రెస్ తాజాగా చేసిన ఈ అధ్యయనంలో ఈ విషయాలు తేలాయి. మరి ఇక వాటి కోసం పూర్తిగా తెలుసుకుందాం.

అయితే మూత్రాన్ని ఎవరైతే కంట్రోల్ చేసుకోలేరో ఆ మహిళలని తీసుకుని పరిశోధన చేశారు. దీంతో మానసిక సమస్యలకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.

ఆడవాళ్ళు యూరిన్ కంట్రోల్ చేసుకోకపోవడం అనేది ఒక సాధారణ సమస్య. అటువంటి వాళ్ళని తీసుకుని ఈ రీసెర్చ్ కొనసాగించారు. దీనిలో మొత్తం పది వేల మంది మహిళలు పాల్గొన్నారు.

వీళ్లపై ఎనలైజ్ చేసారు మరియు మంచి రెస్పాన్స్లు కూడా వచ్చాయి. ఈ మహిళలు అందరూ కూడా 18 ఏళ్లు దాటిన వాళ్ళే. అయితే వీళ్ళ మానసిక ఆరోగ్యం ఎలా ఉంది అనేది నిపుణులు పరిశీలించారు.

మహిళల్లో పదిమందిలో ఒకరు మూత్ర ఆపుకొనలేనిట్లు వెల్లడించారు. అలానే 75 ఏళ్ళకు పైగా వుండే వాళ్లలో ఈ సమస్య ప్రతీ పదిలో నలుగురికి ఉన్నట్టు కనుగొన్నారు. ఆపుకొనలేని పరిస్థితిని నివేదించిన మహిళలు 66 శాతం మంది నిరాశతో బాధ పడుతున్నారని మరియు మానసిక ఆరోగ్య కారణాల వల్ల ఎక్కువగా వైద్యులని సంప్రదిస్తున్నారని తేలింది.

ఏ మహిళలు అయితే యూరిన్ ఆపుకోలేరో.. వాళ్ళలో ఆరోగ్య స్థితి గురించి చూస్తే.. ఏకాగ్రత పెట్టడానికి చాలా ఇబ్బందిగా ఉన్నట్లు అదే విధంగా గిల్టీగా ఉండడాన్ని వాళ్లలో గుర్తించారు.

అదే విధంగా వాళ్ళ పట్ల వాళ్లకి తక్కువ విలువ ఉన్నట్లు గుర్తించారు. ఈ రెండు గ్రూప్స్ కి మధ్య ధూమపానం, మద్యపానం విషయంలో పెద్ద తేడాలు కూడా లేవు.

ఇది ఇలా ఉంటే యూరాలజిస్ట్ Margarida Manso ఇలా అంటున్నారు. ఎవరైతే యూరిన్ ఆపుకోలేరో వాళ్ళలో అధిక స్థాయి నిరాశ మరియు తక్కువ విలువ ఉంది అని అన్నారు. అయితే మూత్రం ఆపుకోలేని వాళ్లలో చికిత్స చేయవచ్చు మరియు చికిత్స నుండి ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చునని చెబుతున్నారు.

వీటి వల్ల ఆరోగ్య ప్రభావం మెరుగుపడుతుందని ఆమె తెలిపారు. అదే విధంగా పేషెంట్ కి యూరాలజిస్ట్ కి మధ్య మాట్లాడే విధానం మారాలి అని ఆమె అంటున్నారు.

చికిత్స గురించి చెప్పేటప్పుడు రోగులతో వాళ్ళ యొక్క మానసిక ఆరోగ్యంపై కూడా మాట్లాడాలని శారీరకంగా చికిత్స చేస్తే మానసికంగా కూడా సమస్యలు ఉండవని వీటిని పేషెంట్లకు అర్థమయ్యేటట్టు చెప్పాలని ఆమె తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news