ఇలా ఈ రెండూ కలిపి తీసుకుంటే బరువు తగ్గచ్చు..!

బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఈ కాంబినేషన్ లో ఆహార పదార్థాలను తీసుకుంటే సులువుగా బరువు తగ్గొచ్చు. మీరు కూడా బరువు తగ్గాలనుకుంటున్నారా అయితే మరి ఇక ఆలస్యం ఎందుకు ఈ ఆహార పదార్థాల గురించి చూసేసి.. మీ డైట్ లో వీటిని తీసుకోండి. ఇలా ఈ కాంబినేషన్ లో తీసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గొచ్చు.

weight loss
weight loss

గ్రీన్ టీ తో నిమ్మ మరియు పుదీనా:

గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గొచ్చు అని మీరు చాలా సార్లు వినే ఉంటారు. అయితే ఇది మరింత బాగా పని చేయాలంటే కొద్దిగా నిమ్మ మరియు పుదీనా ని కూడా గ్రీన్ టీలో వేసుకుని తీసుకోండి దీనితో చక్కటి ప్రయోజనాలు మీరు పొందొచ్చు. గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అలానే నిమ్మ మరియు పుదినా వేసుకు తీసుకుంటే కొవ్వు వేగంగా కరిగిపోతుంది.

నిమ్మ మరియు పైనాపిల్:

పైనాపిల్ లో నీళ్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఎక్కువ నీళ్లు శరీరానికి అంది క్యాలరీలు తగ్గిస్తాయి దీంతో కడుపు నిండుగా ఉంటుంది. అలానే ఇందులో ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది. పైనాపిల్ రసంలో కొద్దిగా నిమ్మరసం వేసుకుని తీసుకుంటే కొవ్వును కరిగించుకోవచ్చు. తద్వారా బరువు తగ్గుతారు.

గుడ్డు మరియు క్యాప్సికం:

గుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది దీంతో పాటు క్యాప్సికం కలిపి తీసుకుంటే బరువు తగ్గొచ్చు. గుడ్ల లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. క్యాప్సికం లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇలా ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గడానికి వీలవుతుంది కాబట్టి మీ డైట్ లో ఇలా ఫాలో అయ్యి బరువు తగ్గండి.