రాష్ట్ర ప్రజలకు సుఖ శాంతులు కలగాలని ప్రార్థిస్తున్నా : కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాాంక్షలు తెలిపారు. సర్వ విఘ్నాలు తొలగించే దైవంగా వినాయకుడిని పూజిస్తారు అని తలపెట్టిన కార్యాలు విజయవంతం అవ్వాలని వినాయకుణ్ణి ఆరాధిస్తారు అని కేసీఆర్ తెలిపారు. అలాగే వినాయక చవితి పండుగ ను పర్యావరణ హితంగా జరుపుకోవాలని కేసీఆర్ సూచించారు.

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం కార్యక్రమాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు సుఖ శాంతులు కలగాలని తాను ప్రార్థిస్తున్నా అని తెలిపారు. ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ ముగించుకుని తిరిని నిన్ననే హైదరాబాద్ కు చేరుకున్నారు. కేసీఆర్ ఈ టూర్ లో కేంద్ర మంత్రులను, ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా లను కలిశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు.