బరువు తగ్గించే సలాడ్.. 10నిమిషాల్లో తయారు చేసుకోండి.

-

బరువు ( Weight Loss ) తగ్గాలనుకునే వారు తమ డైట్ లో సలాడ్లని చేర్చుకోవడం చాలా ఉత్తమం. తక్కువ కేలరీలున్న ఈ ఆహారం కడుపు నిండుగా ఉంచేందుకు సాయపడుతుంది. ఒక్కసారి దీని రుచి తెలిసిందటే ఇక వదిలిపెట్టలేరు. పండ్లు అయినా కూరగాయలైనా ఏదైనా సరే సలాడ్లలో తక్కువ కేలరీలు ఉండేలా చూసుకోవాలి. దీనిలో అనేక పోషకాలు ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల బరువు తగ్గడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలని అలోచించేవారు సలాడ్లని మిస్ చేసుకోవద్దు.

 

బరువు తగ్గడం | Weight Loss
బరువు తగ్గడం | Weight Loss

ప్రస్తుతం మనం తయారు తెలుసుకోబోతున్న సలాడ్ తక్కువ కేలరీలతో పాటు క్రీమ్ కలిగి ఉంటుంది. క్రీమ్ కలిగి ఉన్న తర్వాత తక్కువ కేలరీలున్న సలాడ్ ఎలా తయారవుతుంది అన్న సందేహం మీకు రావచ్చు. కానీ ఇది నిజం. కావాల్సిన అన్నింటినీ సరైన పాళ్ళలో తీసుకుంటే సరైన సలాడ్ తయారవుతుంది. కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా సలాడ్ ని ఆనందించండి.

దీనికోసం ఒక పాత్ర తీసుకుని అందులో పెరుగు ఉంచండి. గడ్డ పెరుగు అయితే మరీ మంచిది. ఆ తర్వాత ఉప్పు, కారం, మిరియాలు చాట్ మసాలా కలుపుకోండి. మీకు ఇష్టమైన రుచికోసం ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలపండి. దాంతో ఒక మిశ్రమం తయారు అవుతుంది. ఆ తర్వాత బాగాకోసిన ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, లెట్యూస్, బఠాణీలు, పన్నీర్, చెర్రీ, టమాట, ఇంకా ఇతర కూరగాయలను చేర్చుకోవచ్చు. అంటే మీ బరువు తగ్గించే సలాడ్ రెడీ అయిపోయినట్టే.

Read more RELATED
Recommended to you

Latest news