ఉదయం పూట ఈ ఆహారపదార్ధాలని తీసుకుంటే లాభాలెన్నో..!

-

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహార పదార్థాలని మీ డైట్ లో తీసుకోవాలి. అందులోనూ ముఖ్యంగా అల్పాహారం మంచిగా ఉండాలి. చాలా మంది అల్పాహారాన్ని తీసుకోరు. అల్పాహారం తినకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. అయితే ఉదయం పూట ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది అనేది ఇప్పుడు చూద్దాం.

 

healthy breakfast

గుడ్లు:

గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. డైట్ లో తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది అలానే కేలరీలు తగ్గుతాయి. అలాగే బ్రెయిన్ హెల్త్ కి, లివర్ హెల్త్ కి కూడా ఇవి చాలా మంచివి. ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

పెరుగు:

పెరుగు లేదా యోగర్ట్ ఆరోగ్యానికి మంచిది. ఉదయాన్నే దీనిని తీసుకోవడం వలన ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకలిని తగ్గిస్తుంది కాబట్టి ఉదయాన్నే తీసుకుంటే కూడా ఆకలి తగ్గుతుంది. బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది.

కాఫీ:

కాఫీ తో మీ రోజున మొదలు పెడితే చాలా బాగుంటుంది. ఇది మూడ్ ని ఇంప్రూవ్ చేస్తుంది మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. కాబట్టి ఉదయాన్నే కాఫీ కూడా తీసుకుంటే మంచిది.

ఓట్ మీల్ :

ఓట్ మీల్ లో బీటా గ్లూకాన్ అనే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది మరియు కడుపు నిండుగా ఉంచుతుంది.

చియా సీడ్స్:

చియా సీడ్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి ఇది ఇంఫ్లమేషన్ ను కూడా తగ్గిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news